
రవితేజ హీరోయిన్స్ పై ఓ సినీ క్రిటిక్ చేసిన కామెంట్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇంకా రిలీజ్ కానీ సినిమా గురించి కామెంట్స్ చేయడం ఏంటి అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం హరీష్ చేసిన ఈ కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. హీరో రవితేజ ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. హిందీ సూపర్ హిట్ రైడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా భాగ్యాశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి మిస్టర్ బచ్చన్ షో రీల్ విడుదల చేశారు మేకర్స్. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం రవితేజ మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో వచ్చిన ఈ షో రీల్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది ఈ షో రిల్.
ఇదిలా ఉంటే.. మిస్టర్ బచ్చన్ షో రీల్ పై ఓ తమిళ సినీ క్రిటిక్ కామెంట్ చేశాడు. ఈ మధ్య రవితేజ సినిమాల సెలక్షన్ కన్నా హీరోయిన్స్ సెలక్షన్ బాగుంటోంది అంటూ కామెంట్ చేశారు. దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ సాలిడ్ కౌంటర్ వేశాడు.. ఇంకా రిలీజ్ కాని సినిమా కథ గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తావా. సినిమాలో నిన్ను కమెడియన్గా పెట్టుంటే బాగుండేది. పరవాలేదు.. సోషల్ మీడియాలో ఇలానే కామెడీ కంటిన్యూ చెయ్యి.. అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చారు హరీష్. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.