
శ్రీరామ్, రితికా సింగ్ జంటగా ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన హారర్ మూవీ ‘వళరి’. కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం మార్చి 6నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా క్రియేటివ్‌గా ఉంది. టైటిల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. శ్రీరామ్ అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పాడు. శ్రీరామ్ మాట్లాడుతూ
‘ఈ కథ, కథనం ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. సంతోషిణి చాలా క్లారిటీతో సినిమా తీశారు. ఇందులో చాలా పాత ఆయుధాలని వాడాము. అవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అని అన్నాడు. ఇది తన ఫేవరేట్ కథ అని, ఈ సినిమాతో తనకు మంచి పేరొస్తుందని చెప్పింది హీరోయిన్ రితికా సింగ్. సంతోషిణి మాట్లాడుతూ ‘‘వళరి’ అనేది ఒక ఆయుధం.
ఒక బూమరంగ్లా పని చేస్తుంది. మనం ఏం చేసినా కర్మ తిరిగి మన వద్దకే వస్తుంది. ఇందులో రితికా పాత్రకు 'వళరి’అనేది యాప్ట్ టైటిల్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. ఈ చిత్రంలో నటించిన సుబ్బరాజు, ఉత్తేజ్‌తో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.