ఎన్టీఆర్ దేవ‌ర కోసం.. భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన కొరటాల

ఎన్టీఆర్ దేవ‌ర కోసం.. భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన కొరటాల

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా న‌టిస్తోన్న 30వ చిత్రం 'దేవ‌ర'(Devara) షూటింగ్ శ‌ర వేగంగా సాగుతోంది. ప్రస్తుతం గోవా అందాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో తార‌క్..జాన్వీ స‌హాకీల‌క న‌టులంతా పాల్గొంటున్నారు. త‌దుప‌రి షూటింగ్ షెడ్యూల్ ఎక్కడ ఉంటుంది? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సోష‌ల్ మీడియాలో సాగుతోంది. హైద‌రాబాద్ లో ఉంటుందా? యూనిట్ విదేశాలు వెళ్తుందా..? అని ఇలా కొన్ని సందేహాలు తెరపైకి వ‌స్తున్నాయి. 

అయితే యూనిట్ గోవా షెడ్యూల్ అనంత‌రం క‌ర్ణాట‌క‌లో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అక్కడ చిత్రీక‌రించిన కీల‌క స‌న్నివేశాలు ఉండ‌టంతో బెంగుళూరు స‌హా చుట్టు పక్కల ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తారని సమాచారం. ముఖ్యంగా క‌ర్ణాట‌క స‌ముద్ర తీరంలో దేవ‌ర షూటింగ్ జ‌రుగుతుంద‌ని వినిపిస్తుంది.

తీర ప్రాంతం నేప‌థ్యం గ‌ల స్టోరీ కావ‌డంతో అక్కడ తీరంలో కొన్ని స‌న్నివేశాలు ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే ద‌క్షిణాది తీరాన్ని మొత్తాన్ని దేవర చుట్టేసినట్టే లెక్క. వైజాగ్ స‌హా ఏపీలో ప‌లువ ప్రాంతాల్లోనూ దేవ‌ర షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇంకా టీమ్ ఏపీకి రాలేదు. హైద‌రాబాద్ లో నే ప్రత్యేకంగా సెట్లు వేసి నిర్మిస్తున్నారు. 

గోవా షెడ్యూల్ తోనే రియ‌ల్ లొకేష‌న్ల షూట్ మొద‌లైంది. అక్కడ నుంచి క‌ర్ణాటక‌ షిప్ట్ కానుంది. మత్స్యకారుడి నేప‌థ్యంలో సాగే స్టోరీ కావ‌డంతో చిత్రీక‌ర‌ణ దాదాపు ఇండియాలోనే వివిధ లొకేషన్లలోఉంటుంది. పాట‌లు, ఇత‌ర స‌న్నివేశాల‌కు అవ‌స‌రం అనుకుంటే విదేశాల‌కు వెళ్లారని తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.