ప్రభాస్‍తో చేసే సినిమా అందులో భాగం కాదు: డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

ప్రభాస్‍తో చేసే సినిమా అందులో భాగం కాదు: డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

దళపతి విజయ్(Thalapathy Vijay)  హీరోగా లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj) డైరెక్షన్ లో వస్తోన్న లియో మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. లోకేశ్‍కు కెరీర్లో ఐదో సినిమాగా వస్తుండగా..భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మేకర్స్ లియో ప్రోమోషన్లలో బిజీగా ఉన్నారు.ఇందులో భాగంగా డైరెక్టర్ లోకేష్..ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్‌(Prabhas)తో చేయబోయే ప్రాజెక్ట్..మా ఇద్దరి కెరీర్లలోనే ప్రెస్టిజియస్ గా నిలుస్తుందని తెలిపారు. అలాగే ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో (ఎల్‍సీయూ) భాగం కానేకాదని..ప్రభాస్ స్టాండలోన్‍గా..స్పెషల్ మూవీగా రాబోతుందని క్లారిటీ ఇచ్చారు. తన గత సినిమాలకు, ప్రభాస్‍తో చేసే సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదని డైరెక్టర్ లోకేశ్ స్పష్టం చేశారు.

లోకేష్ కనగరాజ్ మూవీస్ విషయానికి వస్తే.. అతను తీసే ప్రతి చిత్రానికి..మరో చిత్రం లింక్ చేస్తూ..సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీంతో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను డైరెక్టర్ క్రియేట్ చేశారు. అందులో భాగంగానే  ఖైదీ, విక్రమ్ మూవీస్ కు దగ్గర లింక్ పెట్టారు. త్వరలో ఖైదీ2, విక్రమ్ 2 సినిమాలు కూడా రాబోతున్నాయి.

ప్రస్తుతం విజయ్ లియో మూవీ కూడా..ఎల్‍సీయూలో భాగమేనని తెలుస్తున్నా..దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సినిమా రిలీజ్ అయితే తప్ప..కన్ఫర్మషన్ వచ్చే ఛాన్సెస్ లేదు. కాగా ఇప్పటికే డైరెక్టర్ లోకేష్.. ఎల్‌సీయూ ముగింపు ఎప్పుడనేది రీసెంట్ గానే చెప్పేసారు. లోకనాయకుడు కమల్ హాసన్‍తో చేసే విక్రమ్ 2 సినిమాతోనే ఎల్‍సీయూ ముగుస్తుందని స్పష్టం చేశారు. 

ప్రభాస్‍తో కోసం ప్రత్యేకమైన ఒరిజినల్ స్టోరీని సిద్ధం చేస్తానని లోకేశ్ కనగరాజ్ స్పష్టం చేయడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ యాక్టింగ్, లోకేశ్ డైరెక్షన్ కలిస్తే.. ఆ చిత్రం ఎలా ఉంటుందో అని..అభిమానులు తెగ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ - లోకేశ్ సినిమా పట్టాలెక్కేందుకు మరో రెండేళ్ల సమయమైనా పట్టే ఛాన్సెస్ కనిపిస్తోన్నాయి.