లియో మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ అవకండి: లోకేష్ కనగరాజ్

లియో మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ అవకండి: లోకేష్ కనగరాజ్

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay thalapathy) టైటిల్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. దానికి దగ్గట్టుగానే సాంగ్స్, ట్రైలర్ ఉండటంతో ఏ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు లోకేష్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. లియో సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా విషయంలో ఒక కొత్త ప్రయత్నం చేసాం. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఇక లియో సినిమాలో మొదటి పదినిమిషాలు చాలా కీలకం. ఆ పదినిమిషాలను ఎవ్వరూ మిస్ అవకండి. ఆ సీక్వెన్స్ కోసం కొన్ని వేల మంది కష్టపడ్డారు. ఆ కష్టం తెరపై క్లియర్ గా కనిపిస్తుంది.. అంటూ చెప్పు కొచ్చాడు లోకేష్. 

ఇక లియో సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్స్ గా కనిపిస్తున్నారు. లలిత్ కుమార్, జగదీశ్ పళనిసామి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాకి ఆడియాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందే.