ఆమె కడుపున పుట్టాలని కోరుకుంటున్నా.. దర్శకుడు మిస్కిన్ షాకింగ్ కామెంట్స్

ఆమె కడుపున పుట్టాలని కోరుకుంటున్నా.. దర్శకుడు మిస్కిన్ షాకింగ్ కామెంట్స్

సౌత్ నటి పూర్ణ(Purnaa) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు మళయాళ నటి అయినప్పటికీ.. తెలుగు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. శ్రీ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆతరువాత  సీమ టపాకాయి, లడ్డు బాబు, అవును, రాజు గారి గది, రాక్షసి వంటి సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఓపక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు పూర్ణ. అయితే చాలా గ్యాప్ తరువాత ఆమె నటించిన తాజా చిత్ర డెవిల్. దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇందులో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు యూనిట్. డెవిల్ సినిమా గురించి నటి పూర్ణ మాట్లాడుతూ..  డెవిల్ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. నా జీవితానికి రిలేటెడ్‌ ఎమోషన్. ఈ సినిమా నాకు చాలా కీలకం. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతుంది అనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే పిచ్చి. సినిమాలో నిజాయితీ ఉండాలి. అదే మనకు విజయాన్ని అందిస్తుంది. ఆ విషయాన్ని దర్శకుడు మిష్కిన్ నుండి నేర్చుకున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాకు మొదటిసారి సంగీతం అందించిన ప్రముఖ దర్శకుడు మిస్కిన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పూర్ణ నటన అద్భుతం. అయితే మా ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని పుకార్లు రాస్తున్నారు. వాటిలో ఏ మాత్రం నిజంలేదు. నిజానికి ఆమె నాకు తల్లిలాంటి వారు. వచ్చే జన్మంటూ ఉంటే ఆమెకు కడుపున పుట్టాలని కోరుకుంటున్నానని.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ మాటలు విన్న నటి పూర్ణ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.