జైలర్ 2 కోసం అడ్వాన్స్ అందుకున్న దర్శకుడు.. స్టార్ హీరోస్ రేంజ్ రెమ్యునరేషన్

జైలర్ 2 కోసం అడ్వాన్స్ అందుకున్న దర్శకుడు.. స్టార్ హీరోస్ రేంజ్ రెమ్యునరేషన్

తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson dilip kumar) తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జైలర్(jailer). సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 15 రోజుల్లోనే రూ.700 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో చాలా కాలంగా రజినీకాంత్ రేంజ్ హిట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ దక్కాయి. సినిమాలో రజిని స్క్రీన్ ప్రెజెన్స్ కు ఆడియన్స్ విజిల్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. 

Also Read : విజయ్ మూవీ బిగ్ అప్డేట్.. త్వరలో టైటిల్ అండ్ ఫస్ట్ లుక్

 
ఈ సినిమా రిలీజ్ టైంలోనే జైలర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా జైలర్ మూవీ సీక్వెల్ పై సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. జైలర్ పార్ట్ 2 కోసం ఆల్రెడీ అడ్వాన్స్ అందుకున్నాడట దర్శకుడు నెల్సన్ అది కూడా ఒక స్టార్ హీరో అందుకునే రేంజ్ ఈ సీక్వెల్ కోసం తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సీక్వెల్ కోసం రూ.55 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట నెల్సన్. ఇది గనుక  నిజమైతే సౌత్ లో ఒక సీక్వెల్ కోసం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేస్తాడు నెల్సన్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.