Jai HanuMan: హనుమాన్ని మించి జై హనుమాన్ క్లైమాక్స్..అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

Jai HanuMan: హనుమాన్ని మించి జై హనుమాన్ క్లైమాక్స్..అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

హనుమాన్ (HanuMan)..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించిన ఈ సూపర్ హీరో మూవీ 150 థియేటర్‌లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ‘హిస్టారికల్‌ 50 డేస్‌’ ఈవెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ జై హనుమాన్ సినిమా ఎలా ఉండబోతుందో వెల్లడించారు. 

‘జై హనుమాన్‌’(Jai Hanuman)కు సంబంధించిన స్క్రిప్ట్‌ సిద్ధమైందని..ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని తెలిపారు. త్వరలోనే జై హనుమాన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం..ఇందులో హనుమంతుడే హీరో అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. 

అంతేగాక..‘హనుమాన్‌’ క్లైమాక్స్‌ ఏవిధంగానైతే ఆడియన్స్కు విపరీతంగా నచ్చిందో.. జై హనుమాన్ కూడా కొత్త రెండున్నర గంటల పాటు అదే థ్రిల్‌, జోష్‌తో ఉంటుంది. కచ్చితంగా ప్రతిఒక్కరూ గర్వపడేలా సినిమా తీస్తాను. మీరు అందించిన ఇంతటి గొప్ప విజయాన్ని బాధ్యతగా తీసుకుని, ‘జై హనుమాన్‌’ తీర్చిదిద్దుతా’’ అని డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ అన్నారు. 

జై హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హనుమంతు పాత్రలోనే కనిపిస్తారు కానీ, ఆంజనేయుడి పాత్రలో మాత్రం ఓ స్టార్‌ హీరో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి చిన్న హీరోతోనే ఈ రేంజ్ హిట్టు కొట్టిన ప్రశాంత్.. స్టార్ హీరోతో అది కూడా హనుమంతులవారి పాత్రతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.