తారక్తో అలాంటి సినిమా.. అంచనాలు పెంచుతున్న ప్రశాంత్ కామెంట్స్

తారక్తో అలాంటి సినిమా.. అంచనాలు పెంచుతున్న ప్రశాంత్ కామెంట్స్

ఎన్టీఆర్(Ntr), ప్రశాంత్ నీల్(Prashanth neel).. ఈ కాంబో కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అనౌన్స్మెంట్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. తాజాగా మరోసరి ఈ సినిమా ట్రేండింగ్ లోకి వచ్చింది. 

కారణం సాలార్ మూవీ. అవును ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన సలార్ ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, నార్మల్  ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూ పాల్గొని సలార్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అంతేకాదు తన తరువాత సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రశాంత్. ఇందులో భాగంగా.. ఎన్టీఆర్ తో మీరు చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది? జానర్ ఏంటి? ఆడియన్స్ మాత్రం అవుట్ అవుట్ యాక్షన్ సినిమా రానుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు.. అని యాంకర్ ప్రశ్నించగా. దానికి సామాధానంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో నేను చేయబోయే సినిమా ఏ జానర్ లో వచ్చిన అది ఖచ్చితంగా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఎండింగ్ లో మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు ప్రశాంత్. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి కేజిఎఫ్, సలార్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న ప్రశాంత్.. ఎన్టీఆర్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నారు, అది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.