
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్(Hanuman). సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమ్ములేపుతోంది. రిలీజ్ కు ముందు చాలా అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను తమ భుజాలపై వేసుకున్నారు. థియేటర్స్ ఎక్కువగా దొరక్కపోయినా.. సాలిడ్ హిట్ సాధించింది హనుమాన్.
ఎన్ని అవాంతరాలను దాటుకొని హనుమాన్ సినిమా సక్సెస్ సాదించినా.. ఇప్పటికి కూడా సినిమాపై కావాలని నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారట. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిమరీ.. హనుమాన్ సినిమా గురించి ఇష్టమొచ్చిన పోస్ట్ లు చేస్తున్నారట. ఓ నెటిజన్ అయితే ఏకంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఫేక్ న్యూస్ పోస్ట్ చేశారట. ఇలా డైరెక్టర్, సినిమాపై కొంతమంది నెగిటివ్ గా పోస్టులు చేస్తున్నారు. అలా హనుమాన్ సినిమాకు నెగిటీవ్ వచ్చేలా చేస్తున్నారట.
తాజాగా ఇదే విషయంపై స్పందించారు ప్రశాంత్ వర్మ.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ చాలా వస్తున్నాయి. చాలా మంది మాపై, మా టీంపై, హనుమాన్ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. భోగి రోజు ఇలాంటి సోషల్ మీడియా చెత్తని మంటల్లో వేయడం మర్చిపోయారేమో. ఇలాంటివి ఎన్ని జరిగినా ధర్మం కోసం నిలబడే వారు ఎప్పటికైనా గెలుస్తారు. అదే నేను నమ్మేది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ మా సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు.. అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.