అల్లు అర్జున్ డ్యాన్స్కి వంద రూపాయలు..ఎందుకో తెలుసా?

అల్లు అర్జున్ డ్యాన్స్కి వంద రూపాయలు..ఎందుకో తెలుసా?

69వ జాతీయ సినిమా అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్ను వరించింది. పుష్ప మూవీలో నటనకు ఈ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇండియా లెవెల్లో విషెస్ పొందుతున్నారు అల్లు అర్జున్.  లేటెస్ట్గా ఐకాన్ స్టార్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అల్లు అర్జున్ రియల్ ఇన్సిడెంట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  

అదేంటంటే, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, అల్లు అర్జున్ మధ్య జరిగిన విషయం ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. చిన్నప్పుడు అల్లు అర్జున్ ..చిరంజీవి బర్త్డే వేడుకల్లో ఒక సాంగ్కి డ్యాన్స్ చేయడం గమనించారట రాఘవేంద్ర రావు. అల్లు అర్జున్ డ్యాన్స్ కి ఫిదా అయినా దర్శకేంద్రుడు వంద రూపాయలు తీసుకో అని ఇచ్చాడట. అలాగే అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మలకి మాట ఇస్తూ..వీడి డ్యాన్స్కి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను..అర్జున్ పెద్దయ్యాక ఫస్ట్ మూవీ నేనే చేస్తాను అంటూ రాఘవేంద్ర రావు మాట ఇచ్చారట. అలా గంగోత్రి మూవీ సెట్ అయ్యిందని టాక్. ఇక అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకి తన ప్రతి మూవీలోని డ్యాన్స్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.     

సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపిస్తారు.అయితే తన మేనరిజం..నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.తగ్గేదేలా అంటూ గడ్డాన్ని చేతితో తిప్పే మేనరిజం డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. పుష్ప మూవీకి ఈసారి అవార్డులు ఖాయం అనే టాక్ మొదటి నుంచి ఉంది. అయితే ఏకంగా అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడికిగా ఎంపిక కావటం..తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.