చంద్రబాబు అరెస్ట్ పై.. రాఘవేంద్ర రావు మరో ట్వీట్

చంద్రబాబు అరెస్ట్ పై.. రాఘవేంద్ర రావు మరో ట్వీట్

స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాం(Skill Development Scam)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ అయినా విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ..పలువురు సినీ, రాజకీయ నేతలు వరుస ట్వీట్స్ చేస్తున్నారు.

లేటెస్ట్గా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు(Raghavendra Rao K) మరోసారి ట్వీట్ చేశారు..శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఎలా అయితే బ్రతికి బయట పడ్డారో..ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండ బయటకు వస్తారు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక రీసెంట్ గా రాఘవేంద్ర రావు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందంటూ..ఒక విజనరీ లీడర్ నారా చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

చంద్రబాబు అరెస్ట్ విషయంలో స్పందిస్తున్న రాఘవేంద్ర రావుకి..సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. స్కాం చేశాడా..లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. మధ్యలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.