సలార్ మొదటి టికెట్ అందుకున్న రాజమౌళి.. ధర ఎంతో తెలుసా?

సలార్ మొదటి టికెట్ అందుకున్న రాజమౌళి.. ధర ఎంతో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ మాత్రం చేయడం లేదు మేకర్స్. ఇప్పటివరకు ఒక ఇంటర్వ్యూ గానీ.. ప్రెస్ మీట్ గానీ నిర్వహించలేదు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఉంటుందని భావించారు ఫ్యాన్స్ కానీ.. ఆ ముచ్చట కూడా లేకుండా చేశారు. సలార్ సినిమాను ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు అదేసమయంలో సినిమా బాగుంటే అదే చాలు అనుకుంటూ తమను తామే సర్దిచెప్పుకుంటున్నారు. 

కాబట్టి.. ఫ్యాన్స్ కోరికను కాదనకుండా సలార్ మేకర్స్ దర్శకధీరుడు రాజమౌళితో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా.. సలార్ తొలి టికెట్ ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కొనుక్కున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య 70MM థియేటర్ లోని ఈ టికెట్ ను రూ.10,116 భారీ ధరకు కొన్నారు  జక్కన్న. కాగా.. సలార్ సినిమా నైజాం హక్కులను దక్కించుకున్న  మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఈ టికెట్ ను రాజమౌళికి అందజేశారు.