RGV Dhurandhar 2: సర్కస్‌లో పాత హీరోలు.. మారకపోతే మాడిపోతారు అంతే: ‘ధురంధర్‌ 2’పై ఆర్జీవీ ప్రశంసలు

RGV Dhurandhar 2: సర్కస్‌లో పాత హీరోలు.. మారకపోతే మాడిపోతారు అంతే: ‘ధురంధర్‌ 2’పై ఆర్జీవీ ప్రశంసలు

బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న“ధురంధర్‌: ది రివెంజ్”పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఆయన “ఇండియన్ సినిమాకు రీసెట్ బటన్”గా అభివర్ణించడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

డైరెక్టర్ ఆదిత్యధర్-రణవీర్ సింగ్ కాంబోలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. అదే సమయంలో సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆర్జీవీ సినిమాపై స్పందిస్తూ.. పరోక్షంగా ఇతర మేకర్స్, యాక్టర్స్పై బాణాలు సంధించారు.

మూసధోరణిలో కురుకుపోయిన కథలనే వండిపెడుతున్న దర్శకులు, హీరోలను వైర్లు, క్రేన్‌లతో పైకిలేపుతూ సన్నివేశాలు తీస్తున్న నిర్మాతలు, రక్తం చిందించని, నొప్పి తెలియకుండా సినిమాలు తీసిన అవుట్‌ డేటెడ్‌ హీరోలపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మార్చి 21న సోషల్ మీడియా X వేదికగా స్పందించిన వర్మ, “ధురంధర్‌ 2.. ఒక సినిమా మాత్రమే కాదు.. ఇది ఇండియన్ సినిమాకు రీసెట్ బటన్. మార్చి 19, 2026కు ముందు వచ్చిన సినిమాలన్నింటిని మర్చిపోవాలి. ఆ తర్వాత తీసే ప్రతి సినిమాను ‘ధురంధర్‌ 2’తో పోల్చి, దాన్ని బెంచ్‌మార్క్‌గా తీసుకోవాలి. లేకపోతే అవి ఈ సినిమా ప్రభావంలో కనుమరుగవుతాయి” అని వ్యాఖ్యానించారు.

“ఫిల్మ్ మేకర్స్‌కు ఇది ఒక హెచ్చరికలా మారిందని, అరుపులు, కేకలు, ఓవర్ మసాలా, అవాస్తవ యాక్షన్ సన్నివేశాల కాలం ముగిసిందని వర్మ తెలిపారు. ఇకపై నిజాయితీగా, శక్తివంతమైన పాత్రలతో కథలు చెప్పే సినిమాలే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు.

ఇప్పటివరకు రక్తం చిందించని, నొప్పి తెలియకుండా సినిమాలు తీసిన అవుట్‌డేటెడ్ హీరోలందరిని చంపి, రణ్‌వీర్ సింగ్‌ నటనతో సరికొత్తగా జన్మించారు. తమను తాము దేవుళ్లుగా భావించిన హీరోలంతా ఇప్పుడు సర్కస్‌లో విదూషకుల్లా కనిపిస్తారు. ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లు చూసి వారి అభిమాన గణం భయపడుతుంది.”అని ఆర్జీవీ తెలిపారు.

మనుషులు యాభై అడుగుల ఎత్తుకు ఎగిరిపడటం, రబ్బరు బంతుల్లా నేల మీద బౌన్స్ అవ్వడం.. నగరాలను కుప్పకూల్చే పేలుళ్ల నుండి ప్రాణాలతో బయటపడటం, ఇంకా భుజాలు దులుపుకుంటూనే పంచి డైలాగులు చెప్పడం వంటి అవాస్తవ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇప్పుడు చీప్ & ఫేక్ మరియు ridiculousగా కనిపిస్తాయని వర్మ వివరించారు. 

చివరగా “ఇంకోసారి కండలు, ఫ్యాషన్, హెయిర్‌ స్టైల్స్‌కు కాదు, శక్తి, సామర్థ్యం, తెలివితేటలతో నటించే హీరోలే భవిష్యత్తులో ప్రేక్షకులకు ఆకట్టుకుంటారు.” అని కూడా ఆర్జీవీ తనదైన శైలిలో జోశ్యం చెప్పారు. 

అంతేకాకుండా ఈ సినిమా సాధారణ ప్రశంసలకు అతీతమని, భవిష్యత్‌లో సినిమాల నిర్మాణ విధానాన్ని మార్చే శక్తి దీనిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఇప్పటికే మార్చి 17న సినిమా చూసిన తర్వాత కూడా వర్మ దీనిని “కొత్త సినీ యుగానికి నాంది”గా పేర్కొంటూ, హాలీవుడ్ దిగ్గజాలు స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ కూడా ఈ సినిమాను చూడాలని సూచించారు.

ఇక “శోలే”, “ముగల్-ఎ-ఆజమ్” వంటి క్లాసిక్ సినిమాలు కూడా దీని ముందు నిలబడలేవని చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే వైరల్ అయ్యాయి. ఇకపోతే.. ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ స్పృష్టిస్తుంది. పెయిడ్‌ ప్రీమియర్స్‌తో కలిపి ఈ మూవీ రెండు రోజుల్లోనే దాదాపు రూ.350 కోట్లకి పైగా గ్రాస్‌ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.