అర్జున్ రెడ్డి కన్నా ముందు నాగార్జునతో సందీప్ వంగా చేసిన మూవీ ఏంటో తెలుసా?

అర్జున్ రెడ్డి కన్నా ముందు నాగార్జునతో సందీప్ వంగా చేసిన మూవీ ఏంటో తెలుసా?

సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga).. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ దర్శకుని గురించే చర్చ నడుస్తోంది. కారణం.. ఆయన డైరెక్షన్ లో వస్తున్న యానిమల్(Animal) మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవల రిలీజైన యానిమల్ మూవీ ట్రైలర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

ట్రైలర్ లోని ఒక్కో షాట్, ఒక్కో విజువల్ కి ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ట్రైలర్ లోనే ఇంత విద్వాంసం అంటే.. సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ డిస్కషన్ చేసుకుంటున్నారు. అంతేకాదు.. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడం ఖాయమని, డిసెంబర్ 1న సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే.. తాజాగా యానిమల్ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగానే కాకండా.. నటుడిగా కూడా ఆడియన్స్ ను అలరించాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. సందీప్ నాగార్జున హీరోగా 2010లో కేడి సినిమా వచ్చింది. ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగా ఒక చిన్న పాత్రలో కనిపించారు. దాదాపు 13 సంవత్సరాల తరువాత సందీప్ కు సంబంధించిన ఆ వీడియో ను యానిమల్ మూవీ రిలీజ్ సందర్బంగా వైరల్ చేస్తున్నారు. వీలుంటే మీరు కూడా ఓసారి చూసేయండి.