ఆ విషయం ముందు మీ భర్తని అడగండి.. ఆమిర్ ఖాన్ భార్యకు సందీప్ కౌంటర్

ఆ విషయం ముందు మీ భర్తని అడగండి.. ఆమిర్ ఖాన్ భార్యకు సందీప్ కౌంటర్

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ యానిమల్. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దీంతో భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. ఫస్ట్ వీకెండ్ లోనే రూ.300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. లాంగ్ రన్ లో ఏకంగా రూ.900 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. అక్కడ కూడా రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది.

అయితే.. యానిమల్ ఓటీటీ రిలీజ్ తరువాత ఈ సినిమా పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. బోల్డు కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. కిరణ్ రావు కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

తాజాగా ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న సందీప్ కిరణ్ రావు కామెంట్స్ గురించి మాట్లాడుతూ.. నేను కిరణ్ రావు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా. మీరు అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడండి. ఆ సినిమాలో అమ్మాయిపై రేప్ కు ప్రేరేపించే సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్టు భావించేలా చేస్తాడు. అయినప్పటికీ చివరికి అతడితోనే ప్రేమలో పడుతుంది. మరీ దీన్ని ఏమంటారు?. ఇలాంటివి చూడకుండా ఎలా కామెంట్స్ చేస్తారో అర్థం కావడం లేదు.. అంటూ కామెంట్స్ చేశారు సందీప్.