మరో గాఢమైన మజిలీకి..సిద్ధమవుతున్న ఆ ఇద్దరు!

మరో గాఢమైన మజిలీకి..సిద్ధమవుతున్న ఆ ఇద్దరు!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) కలిసి నటించిన క్రేజీ సినిమా మజిలీ(Majili). శివ నిర్వాణ (ShivaNirvana) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గాఢమైన ప్రేమ, విఫలమైన ఓ క్రికెటర్ జీవితంలో పెళ్లి తర్వాత భార్యతో జరిగిన సంఘర్షణ వంటి అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ప్రేమతో పాటే బాధ ఉంటుందని శివ నిర్వాణ..నాగ చైతన్య కాంబో నిరూపించింది.

మరోసారి ఈ కాంబో సెట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. 'శివ..నేను కలిసి ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాం. దాని గురించి మేం రోజు మాట్లాడుకుంటున్నాం. ప్ర‌స్తుతానికి ఆ క‌థ‌పైనే ఫోకస్ పెట్టినట్టు చై తెలిపారు. స్వయంగా నాగ చైతన్య ఈ విషయాన్ని తెల్పడం విశేషం. 

అలాగే  శివ నిర్వాణ కు టాలీవుడ్ మ‌ణిర‌త్నం గా మంచి పేరుంది. తనదైన కథలతో..మంచి ఫీలింగ్ తో అన్ని కుదిరేలా సెట్ చేసుకుంటాడు. ఇక ఆయ‌న క‌థ‌లు ఆయ‌నే స్వ‌యంగా రాసుకుంటూ..అవ‌స‌ర‌మైతే ఆయ‌నే పాటల ర‌చ‌యిత‌గానూ మారిపోవడం అందరం చూస్తున్నాం.

రీసెంట్గా వచ్చిన ఖుషి సినిమాలో అన్ని సాంగ్స్ రాసి..హిట్ ఆల్బమ్గా మలిచిన క్రెడిట్లో శివ నిర్వాణ అనే చెప్పడంలో సందేహం లేదు. అంతేకాకుండా..మ‌జిలీ సినిమాలోనూ హిట్ పాట‌ల్లో ఆయ‌న హ‌స్తం ఉంది.

ప్ర‌స్తుతం చైత‌న్య కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తో తండేల్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తిచేసిన త‌ర్వాత శివ నిర్వాణ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించనున్నట్లు సమాచారం.