Venky Re Release: వెంకీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌..శ్రీను వైట్ల స్పెషల్ వీడియో

Venky Re Release: వెంకీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌..శ్రీను వైట్ల స్పెషల్ వీడియో

మాస్ మహరాజా రవితేజ (Raviteja) నటించిన వెంకీ (Venky) సినిమా రేపు డిసెంబర్ 30న థియేటర్లో రీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసిన తొలిరోజే 6 వేల 500 టికెట్లు అమ్ముడుపోవడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. దీంతో మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

లేటెస్ట్గా వెంకీ మూవీ డైరెక్టర్ శ్రీను వైట్ల..సినిమా రీ రిలీజ్కు వస్తోన్నఅద్భుత స్పందనపై వీడియో రిలీజ్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు.‘నాకెంతో ఇష్టమైన రవితేజ ‘వెంకీ’ (Venky) సినిమా రీ రిలీజ్‌ అవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫేవరేట్ సినిమా. ఈ సినిమా ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వొస్తుంటుంది. ఇందులో రవితేజ చేసిన అల్లరి కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ అంత సరదాగా ఒక ప్రయాణంలో తెరెకెక్కించిన ఫీలింగ్ కలుగుతోంది.

వెంకీ మూవీ అంత బాగా రావడానికి ప్రధాన కారణం హీరో రవితేజ. ఆయన నాపై ఉంచిన నమ్మకంతోనే నటించేందుకు ఓకే చెప్పారు. అందులో యూత్ చేసిన కామెడీ,వారు ఎదుర్కొనే సవాళ్లు..భావోద్వేగాలతో కూడిన సీన్స్ ఇవన్నీ ఉండటంతో..వెంకీ సినిమా ఎవర్‌గ్రీన్‌. అందులో బ్రహ్మానందం పోషించిన పాత్రకు..ఎంతో మంది కనెక్ట్ అయ్యారు.

2004లో వచ్చిన ఈ మూవీ..ఇప్పటికీ రీ రిలీజ్‌ టికెట్స్‌ బుకింగ్స్‌ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది..ఇంతటి రెస్పాన్స్ చూపిస్తున్న ఆడియన్స్ కి కృతజ్ఞతలు..అంటూ శ్రీను వైట్ల తెలిపారు.

"Venky" is very close to me!!
The challenges faced by youth, their emotions, and response to situations remain almost same across different timelines. The realistic presentation of those aspects made the film ever-green!!
The way @RaviTeja_offl portrayed his character and… pic.twitter.com/QlUtzXWPVD

— Sreenu Vaitla (@SreenuVaitla) December 29, 2023

 

 

రవితేజ కెరీర్లో వెంకీ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా గంటకు పైగా సాగే సుధీర్ఘమైన ట్రైన్ ఎపిసోడ్ థియేటర్లలో ఓ రేంజ్లో పేలింది. బ్రహ్మానందం, ఏవీఎస్, మాస్టర్ భరత్ల పాటు హీరో ఫ్రెండ్స్ బృందం చేసే కామెడీ మాములుగా నవ్వించలేదు. ఇప్పటికీ ఎన్నో మీమ్స్ వీటిని ఆధారంగా చేసుకునే వస్తుంటాయి.

ఇందులో బ్రహ్మీ ఎక్స్ప్రెషన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు శ్రీను వైట్ల రేంజ్ పెరగడంలోనూ ఇది దోహదపడింది. హీరోయిన్ స్నేహ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అశుతోష్ రానా విలనీ, చక్కని హాస్యం ఇలా ఎన్నో అంశాలు వెంకీ మూవీ విజయానికి దోహదపడ్డాయి.