ఆదికేశవ ..యాక్షన్‌‌తో పాటు ఎమోషన్ కూడా

ఆదికేశవ ..యాక్షన్‌‌తో పాటు ఎమోషన్ కూడా

వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శక త్వంలో  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ‘ఆదికేశవ’. ఈరోజు  సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ‘హైదరాబాద్‌‌లో ఉండే ఒక సాధారణ కుర్రాడు.. ఎక్కడో అనంతపురం దగ్గరున్న కళ్యాణ దుర్గంలోని బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతు న్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ సిని మా కథ. 

ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.  సినిమా ప్రారం భమైన పది నిమిషాలకే హీరో పాత్రతో కనెక్ట్ అవు తారు. వైష్ణవ్ మాస్ లుక్‌‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తా డు. వైష్ణవ్, శ్రీలీల జోడీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ చాలా కొత్తగా  ఉంటుంది. చివరి 45 నిమిషాలు సినిమాకు హైలైట్‌‌. ఎమోషనల్‌‌గా అందరికీ కనెక్ట్‌‌ అవుతుంది.  యాక్షన్ సీన్స్‌‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ అద్భుతమైన ఫైట్స్ కంపోజ్  చేశారు. జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్‌‌, బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌‌గా ఉంటుంది.  నిర్మాత నాగవంశీ చాలా సపోర్ట్ చేశారు’ అని చెప్పాడు.