
బింబిసార ఫేమ్ వశిష్ట..విశ్వంభర వశిష్ట..ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోన్న క్రియేటివ్ డైరెక్టర్ పేరు. తీసిన మొదటి సినిమాతోనే కళ్యాణ్ రామ్ కెరీర్లోనే నెవెర్ బిఫోర్ సక్సెస్ అన్నట్టు హిట్ ఇచ్చాడు డైరెక్టర్ వశిష్ఠ(Vassishta). ఇపుడు చిరంజీవితో తన రెండో సినిమా తెరికెక్కిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. అయితే, ఇపుడు వశిష్ట ఇంట్లో ఆనంద హేల నెలకొంది.
డైరెక్టర్ వశిష్ఠ తండ్రయ్యారు. ఆయన భార్య సుజాత నిన్న సాయంత్రం అంటే సోమవారం(ఫిబ్రవరి 5న) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వశిష్ట దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ క్రమంలో వశిష్ఠ ఫ్యామిలీలో హ్యాపీనెస్ మొదలైంది.
ఇప్పటికీ చిరంజీవితో విశ్వంభర సినిమా తెరకెక్కిస్తున్న ఆనందంలో ఉన్నారు వశిష్ఠ. ఇక ఇపుడు తండ్రవ్వడంతో తన ఆనందం మరింత రెట్టింపు అయింది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ..సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో రానుంది. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.