అబ్బా.. బతికించావు వశిష్ట.. విశ్వంభర అలాంటి సినిమా కాదట!

అబ్బా.. బతికించావు వశిష్ట.. విశ్వంభర అలాంటి సినిమా కాదట!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). బింబిసార(Bimbisara)తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట(Vassishta) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ సంస్థ ఏకంగా రూ.150 కోట్లకు పైగాఖర్చు చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చోటా కె నాయుడు కెమెరామెన్ గా చేస్తున్నారు.

ఇటీవల విశ్వంభర చిత్ర దర్శకుడు వశ్శిష్ట ఇంటర్వ్యూలో పాల్గొని విశ్వంభర సినిమా గురించి, ఆ సినిమాలో చిరంజీవి పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.విశ్వంభర సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇందు కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మెగాస్టార్ కెరీర్ లోనే టాప్ 3లో ఈ సినిమా ఉంటుంది. ఇక అందరు అనుకుటనున్నట్టుగా విశ్వంభర కాస్ట్యూమ్ డ్రామా మూవీ కాదని. సోషల్ గా ఉంటునే ఫిక్షనల్ వరల్డ్ తో కనెక్ట్ అవుతుందని చెప్పారు. 

ఇది విన్న మెగా ఫ్యాన్స్ కాస్త ఆనందంగా ఫీలవుతున్నారు. బ్రతికించావు వశిష్ట అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి చిరంజీవికి కాస్ట్యూమ్ డ్రామా మూవీస్ పెద్దగా సెట్ అవ్వవు. ఆయన ప్రాధాన పాత్రల్లో వచ్చిన రీసెంట్ మూవీ సైరా నే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్. ఈ సినిమాలో చిరు గెటప్ పై చాలా ట్రోల్స్ జరిగాయి. ఇక విశ్వంభర, సోషియో ఫాంటసీ అనగానే ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అనుకుని భయపడ్డారు మెగా ఫ్యాన్స్. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇవ్వడంతో ఒప్పిరిపీల్చుకుంటున్నారు. ఇక విశ్వంభర మూవీ 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.