పురుష: భార్యాబాధితుల కథ

పురుష: భార్యాబాధితుల కథ

బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా వీరు వులవల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుష:’. బత్తుల కోటేశ్వరరావు నిర్మించారు. మే 22న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ ‘దాదాపు 350 సినిమాలకు నేను టైటిల్ డిజైన్స్ చేశాను. దర్శకుడిగా మారాలని గౌతమ్ తిన్ననూరి దగ్గర అసిస్టెంట్‌‌‌‌గా వర్క్ చేశా. మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా చేశా.

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే పాయింట్‌‌‌‌తో భార్యాబాధితుల కథగా రూపొందించాను. ఇందులోని ప్రతి పాత్ర భార్యాబాధితుడే. కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ఉంటుంది.  ప్రేమ కోసం ఏమైనా చేసే  పాత్రలో పవన్ కనిపిస్తారు. వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, వెన్నెల కిషోర్, సప్తగిరి, కసిరెడ్డి  ఇలా ప్రతీ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది.  నిర్మాత కోటేశ్వరరావు గారు ఫైనల్ అవుట్‌‌‌‌పుట్ చూసి ఇది  తన  26 ఏళ్ల కల అని కన్నీరు పెట్టుకున్నారు’ అని చెప్పాడు.