నీ చూపు పడలేని ప్రేమ నాదేనా - ఇట్లు అర్జున

నీ  చూపు పడలేని ప్రేమ నాదేనా - ఇట్లు అర్జున

డైరెక్టర్  వెంకీ కుడుముల  తన నిర్మాణ  సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం  ‘ఇట్లు అర్జున’.   అనీశ్  హీరోగా,  మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  అనస్వర రాజన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.  తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

 ‘హాయ్‌‌‌‌‌‌‌‌ రే’ అంటూ సాగిన పాట  యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎనర్జీతో, క్యాచీ ట్యూన్స్‌‌ తో ఆకట్టుకుంటోంది. తమన్   కంపోజ్ చేసిన పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా, అనిరుధ్ రవిచందర్ పాడిన తీరు ఆకట్టుకుంది.  

‘హాయ్ రే.. హాయ్‌‌‌‌‌‌‌‌ రే.. హాయ్.. తెగ పడిపడి వెనకపడతామో  హాయ్.. నీ  చూపు పడలేని ప్రేమ నాదేనా.. నిన్ను నేను చూస్తున్న శబ్ధం మారేనా.. నిన్నందుకోలేని అడుగే నాదైనా..’ అంటూ ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌గా సాగిందీ పాట.  ఇందులో  అనీశ్, అనస్వర రాజన్ లుక్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది.