Vijay Thalapathy: విజయ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. సినిమా రావడం కష్టమే.. ఓపెన్గా చెప్పేసిన దర్శకుడు

Vijay Thalapathy: విజయ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. సినిమా రావడం కష్టమే.. ఓపెన్గా చెప్పేసిన దర్శకుడు

తమిళ స్టార్ తలపతి విజయ్(Vijay Thalapathy) తో సినిమా గురించి దర్శకుడు వెట్రిమారన్(Vetrimaran) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆయనతో సినిమా వర్కౌట్ అవుతుందని నేను అనుకోవడం లేదని అన్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తలపతి విజయ్ ప్రస్తుతం విలక్షన్స్ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా తరువాత విజయ్ తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తో సినిమా చేయనున్నాడు అనే వార్తలు వినిపించాయి. 

నిజానికి ప్రేక్షకుల్లో వెట్రిమాన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉండే ఆయన సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేస్తూ ఉంటారు. విజయ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో  వెట్రిమారన్ లాంటి దర్శకులతో సినిమా చేయాలని ఆయన ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ కాంబోపై ఇటీవల చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన వెట్రిమారన్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా జరుగుతుందని అనుకోవడం లేదు.. అంటూ షాకిచ్చాడు. దాంతో ఈ కాంబోలో సినిమా లేదు అనే క్లారిటీ వచ్చేసింది. మరి ఫ్యూచర్ లో ఐనా ఈ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి.