కష్టాల్లో ముంబై.. కేవలం 41 రన్స్ కే 4 వికెట్లు డౌన్

కష్టాల్లో ముంబై.. కేవలం 41 రన్స్ కే 4 వికెట్లు డౌన్

MI vs KKR: ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే.. మొదటగా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ముంబై ఇండియన్స్‌కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 

మొదట బ్యాటింగ్ కి వచ్చిన ముంబై ఇండియన్స్ జట్టుకి ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి కామెరూన్ గ్రీన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ దగ్గర ఉన్న మనీష్ పాండేకి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నమన్ ధీన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. గ్రీన్ బౌలింగ్ లోనే వికెట్ కీపర్ రఘువంశీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో 17 పరుగుల వద్దే రెండు వికెట్లని కోల్పోయింది. 

మరో ఎండ్ లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ (15) మంచి బ్యాటింగ్ చేశాడు. రెండు భారీ సిక్సులు కొట్టిన తర్వాత సౌరభ్ దూబే వేసిన ఓ అద్బుతమైన బంతికి కామెరూన్ గ్రీన్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి చేరుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వచ్చి రావడంతో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కానీ సౌరభ్ దూబే వేసిన ఓ కిరాక్ బంతికి సూర్య (15) క్లిన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 41 పరుగులకే కీలకమైన 4 వికెట్లని ముంబై ఇండియన్స్ జట్టు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా ( 4), తిలక్ వర్మ(2) ఉన్నారు. కేకేఆర్ బౌలర్లలో సౌరబ్ దూబే, కామెరూన్ గ్రీన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.