దసరా ధమాకా.. మారుతి కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.65 లక్షల వరకు అఫర్స్ ఇవే !

 దసరా ధమాకా.. మారుతి కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.65 లక్షల వరకు అఫర్స్ ఇవే !

దసరా పండగ వచ్చేసింది. అయితే ఈ పండగ  సందర్భంగా ఏదైనా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్ కావచ్చు. ఎందుకంటే మారుతి సుజుకి  కొన్ని మోడళ్ల కార్లపై అక్టోబర్ 2026లో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో మారుతి విక్టోరిస్‌పై ఏకంగా రూ.1.65 లక్షల వరకు బెనిఫిట్స్  ఇస్తుండగా, స్విఫ్ట్, వాగన్ ఆర్, ఆల్టో K10 వంటి కార్లపైనా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి.

ఈ డిస్కౌంట్లలో క్యాష్ తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, అన్ని కార్లకు ఒకే రకమైన ఆఫర్లు ఉండవు. మోడల్, వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్స్  మారుతాయి. మరి ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసుకుందామా....

మారుతి విక్టోరిస్‌పై రూ.1.65 లక్షల వరకు తగ్గింపు
ఈ లిస్టులో మారుతి విక్టోరిస్ పై అత్యధిక  డిస్కౌంట్‌ను ఇస్తోంది. దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై రూ.1.65 లక్షల వరకు ఆఫర్స్ ఉన్నాయి. ఇందులో రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 లాయల్టీ బోనస్, రూ.95,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. పాత కారును ఎక్స్ఛేంజ్ చేయకూడదనుకునే వారికి నిబంధనల ప్రకారం రూ.45,000 వరకు స్క్రాపేజ్ బోనస్ కూడా  ఉంది.

ఇక పెట్రోల్ వేరియంట్లపై రూ.1.10 లక్షల వరకు, CNG వేరియంట్లపై రూ.95,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉంది.

మారుతి స్విఫ్ట్‌పై రూ.71,000 వరకు ఆఫర్
యువతలో మంచి క్రేజ్ ఉన్న మారుతి స్విఫ్ట్‌పై కూడా కంపెనీ డిస్కౌంట్లు అందిస్తోంది. స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.71,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో యాక్సెసరీ కిట్ వాల్యూ కూడా కలిపి ఉంటుంది. ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ.40,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5,000 అదనపు తగ్గింపు ఉన్నాయి.

స్విఫ్ట్ CNG వేరియంట్‌పై రూ.30,000 వరకు ప్రయోజనాలు  ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.84 లక్షల నుంచి రూ.8.74 లక్షల వరకు ఉంది.

మారుతి సెలెరియోపై రూ.67,500 వరకు తగ్గింపు
తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారికి మారుతి సెలెరియో ఒక మంచి ఆప్షన్. ఈ కారు పెట్రోల్ వేరియంట్‌పై రూ.67,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ.40,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2,500 ఎక్స్ట్రా తగ్గింపు ఉన్నాయి. CNG వేరియంట్‌పై రూ.47,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.75 లక్షల వరకు ఉంటుంది.

మారుతి వాగన్ ఆర్‌పై రూ.67,000 వరకు ప్రయోజనాలు
కుటుంబ అవసరాలకు అనువుగా ఉండే మారుతి వాగన్ ఆర్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. వాల్ట్జ్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.67,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.38,000 విలువైన యాక్సెసరీ కిట్, రూ.1,900 ఎక్స్ట్రా తగ్గింపు ఉన్నాయి. ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ.57,500 వరకు, CNG వేరియంట్లపై రూ.52,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

వాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.24 లక్షల వరకు ఉంటుంది. అయితే, వాల్ట్జ్ ఎడిషన్‌పై ప్రకటించిన మొత్తం ప్రయోజనంలో యాక్సెసరీ కిట్ వాల్యూ కూడా ఉందని గుర్తుంచుకోవాలి.

మారుతి ఆల్టో K10పై రూ.57,500 వరకు డిస్కౌంట్
బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి మారుతి ఆల్టో K10 గొప్ప  అప్షన్ . ఈ కారు LXi పెట్రోల్ వేరియంట్‌పై రూ.57,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2,500 అదనపు తగ్గింపు ఉన్నాయి. ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ.47,500 వరకు, CNG వేరియంట్లపై రూ.37,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంటుంది.

మారుతి ఎస్-ప్రెస్సోపై రూ.37,500 వరకు తగ్గింపు
మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్‌పై రూ.37,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2,500 అదనపు తగ్గింపు ఉన్నాయి. CNG వేరియంట్‌పై రూ.27,500 వరకు ప్రయోజనాలు  ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.3.50 లక్షల నుంచి రూ.5.27 లక్షల వరకు ఉంటుంది.

మారుతి ఈకోపై రూ.37,500 వరకు ఆఫర్
ఎక్కువ మంది ప్రయాణించడానికి అనువైన కార్ మారుతి ఈకోపైనా డిస్కౌంట్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్‌పై రూ.37,500 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, CNG వేరియంట్‌పై రూ.32,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్‌పై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2,500 అదనపు తగ్గింపు ఉన్నాయి. CNG వేరియంట్‌పై రూ.5,000 నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, అదనపు తగ్గింపు లభిస్తాయి.

మారుతి ఈకో ఎక్స్-షోరూమ్ ధర రూ.5.28 లక్షల నుంచి రూ.6.46 లక్షల వరకు ఉంటుంది.

కారు కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
దసరా సందర్భంగా ప్రకటించిన ఈ డిస్కౌంట్లు కారు కొనేవారికి ఉపయోగపడవచ్చు. అయితే, అత్యధిక తగ్గింపు అందరికీ వర్తిస్తుందని అనుకోవద్దు. కొన్ని ఆఫర్లు కొన్ని వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఎక్స్ఛేంజ్ బోనస్ పొందాలంటే పాత కారును ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, యాక్సెసరీ కిట్ వాల్యూ కూడా మొత్తం ప్రయోజనంలో కలిపి చూపించే అవకాశం ఉంది.

గమనిక: పైన పేర్కొన్నవి అక్టోబర్ 2026కు సంబంధించిన ప్రయోజనాలు. డిస్కౌంట్ అఫర్ నగరం, డీలర్‌షిప్, వేరియంట్, స్టాక్ లభ్యత, ఆఫర్ నిబంధనలను బట్టి మారవచ్చు. కారు బుక్ చేసే ముందు మీ దగ్గరలోని  మారుతి డీలర్‌ను సంప్రదించి, క్యాష్  డిస్కౌంట్ ఎంత? ఇతర బోనస్‌లు పొందడానికి ఏ నిబంధనలు వర్తిస్తాయి? అనే వివరాలు అడిగి తెలుసుకోవడం మంచిది.