మీర్జాపూర్’ సిరీస్‌లో మున్నాభయ్యాగా మెప్పించిన బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మకు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో తను కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్న టీమ్.. శుక్రవారం దివ్యేందు శర్మ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తోపాటు తన క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో తను రామ్ బుజ్జి పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంది.
క్రికెట్ గ్రౌండ్‌లో రామ్ బుజ్జి ఎంట్రీ ఇచ్చిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్, రగ్గడ్ లుక్ పాత్రలోని ఇంటెన్సిటీని చూపించాయి. తన స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దివ్యేందు పాత్రపై ఆసక్తిని పెంచాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఈనెల 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
