దసరాఉత్సవాలు: విజయదశమి( అక్టోబర్20).. ఆ రోజు ఈ పనులు అస్సలు చేయొద్దు..!

దసరాఉత్సవాలు:  విజయదశమి( అక్టోబర్20).. ఆ రోజు ఈ పనులు అస్సలు చేయొద్దు..!

దసరా ఉత్సవాలు చివరి దశకు వచ్చాయి. ఈ ఏడాది ( 2026) అక్టోబర్​20 న విజయదశమి పండుగను సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు.  ఆ రోజున అమ్మవారిని ప్రార్థిస్తూ.. కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. నాన్​ వెజ్​ (తామసిక) ఆహారాలకు దూరంగా ఉండి .. ఆయుధ పూజ వరకు విజయదశమి నాడు పాటించే ముఖ్యమైన ఆచారాలు, నియమాల గురించి  ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హిందువులు జరుపుకొనే పండుగల్లో దసరా పండుగ చాలా ప్రధానమైనది.  చెడుపై  మంచి విజయం సాధించిందిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగ జరుపుకుంటారు.   ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష దశమి తిథి నాడు నిర్వహిస్తారు. 2026లో దసరా పండుగను అక్టోబర్ 20న జరుపుకుంటారు. 

 విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం కూడా ముఖ్యమైన సంప్రదాయం. ప్రజలు దుర్గాదేవిని, శ్రీరాముడిని భక్తిశ్రద్ధలతో పూజించి, తమ కుటుంబాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తారు.  ఈ పర్వదినానికి సంబంధించి కొన్ని ప్రత్యేక ఆచారాలు, నియమాలు ఉన్నాయని మతపరమైన సంప్రదాయాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని పనులకు దూరంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు

 ఆయుధాలు, పనిముట్లకు  పూజ విషయంలో నిర్లక్ష్యం వద్దు

  జీవితం మనుగడ కోసం డబ్బు సంపాదించాలి. మనీ ఎరన్​ కోసం ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తుంటారు.  అలా చేసేటప్పుడు తప్పకుండా కొన్ని పరికరాలు వాడతారు.  విజయదశమి ఆ పనిముట్లను గౌరవించి.. పసుపు.. కుంకుమ.. గంధం.. పూలతో పూజించి అలంకరించి పూజ చేయాలి.  ఇవి తమ జీవనోపాధికి సహకరిస్తున్నాయని కృతజ్ఞత తెలియజేయడానికి ఈ ఆచారాన్ని పాటిస్తారు. 

జంతువులు, పక్షులకు హాని చేయవద్దు

విజయదశమి రోజునే కాకుండా, ప్రతి రోజూ మూగజీవుల పట్ల దయతో వ్యవహరించడం మంచిది. జంతువులను, పక్షులను హింసించడం, వాటికి హాని కలిగించడం చేయకూడదు. ప్రకృతిని, మొక్కలను సంరక్షించడం కూడా మన బాధ్యతగా భావించాలి.

గొడవలు, వాదనలకు దూరంగా ఉండండి

దసరా విజయానికి, శుభారంభాలకు ప్రతీకగా భావించే పండుగ. అందువల్ల ఈ రోజున ఇతరులతో గొడవపడకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండాలని పెద్దలు సూచిస్తారు. మహిళలను, వృద్ధులను, ఇతరులను అవమానించకుండా గౌరవంగా ప్రవర్తించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకోవాలి.

నాన్​ వెజ్​(తామసిక) ఆహారాలకు దూరంగా ఉండండి

దసరా రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేసేవారు సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటించేవారు మాంసాహారం, చేపలు, గుడ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు. అయితే, ఆహార నియమాలు ప్రాంతీయ ఆచారాలు, కుటుంబ సంప్రదాయాలను పాటించాలి.

మద్యం, ధూమపానానికి దూరంగా ఉండండి

విజయదశమి రోజు ఆయుధ పూజ.. జమ్మి పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.  అమ్మవారి ఆశీస్సులతో అన్ని రంగాల్లో విజయం సాధించడానికి అమ్మవారిని భక్తిగా .. శ్రద్దగా పూజించాలి.  మద్యం సేవించినా.. ధూమపానం ( సిగరెట్​, బీడీ, చుట్ట) సేవించిన ఎడల శుచిగా ఉండే విషయంలో లోపం ఏర్పడుతుంది.  అమ్మవారిని పూజించినా.. దేవాలయానికి వెళ్లినా శుచిగా శుభ్రంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

దానం విషయంలో సంప్రదాయాలు

కొన్ని ప్రాంతీయ మత విశ్వాసాల ప్రకారం దసరా రోజున పసుపు, తోలుతో తయారైన వస్తువులు లేదా చిరిగిన బట్టలను దానం చేయకూడదని చెబుతారు. దానం చేయాలనుకునేవారు శుభ్రమైన దుస్తులు, ఆహారం లేదా అవసరమైన వస్తువులను తమకు సాధ్యమైనంతవరకు ఇతరులకు అందించవచ్చు.

సాయంత్రం కొన్ని వస్తువులు ఇవ్వకూడదు

 సాయంత్రం వేళ ఇతరులకు సూది, ఉప్పు, చక్కెర వంటి వస్తువులను ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు

విజయదశమి రోజున గుర్తుంచుకోవాల్సిన విషయాలు

దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేసే పండుగ. ఈ రోజున పూజలు చేయడంతో పాటు ఇతరుల పట్ల గౌరవం, దయ, సహనం చూపించడం, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి మంచి పనులలు చేయాలని పండితులు చెబుతున్నారు

పురాణాల ప్రకారం..త్రేతా యుగంలో ఇదే రోజున  శ్రీరాముడు రావణుడిని సంహరించగా, తొమ్మిది రోజుల పాటు జరిగిన యుద్ధం అనంతరం దుర్గాదేవి పదో రోజున మహిషాసురుడిని వధించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. దసరా సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రామలీల ప్రదర్శనలు, జాతరలు నిర్వహిస్తారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.