VVS Laxman: సరిగ్గా శ్రీలంకతో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుని గాయాల సంక్షోభం తీవ్రంగా కుదిపేస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ లాంటి స్టార్ ప్లేయర్లు సిరీస్‌కు దూరం కావడంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) పని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫిట్‌నెస్ లేని ప్లేయర్లను త్వరపడి ఎంపిక చేశారంటూ వస్తున్న వార్తలపై సీఓఈ హెడ్, భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి విమర్శకుల నోళ్లు మూయించారు.
ఎవరినో ఒకరిని బలిపశువును చేయడం సరికాదు:
గాయపడిన ఆటగాళ్లను అరకొర ఫిట్‌నెస్‌తో సెలెక్షన్‌కు పంపుతున్నారన్న విమర్శలపై వీవీఎస్ లక్ష్మణ్ చాలా ఘాటుగా స్పందించారు. ఎవరినో ఒకరిని బలిపశువును (Scapegoat) చేయడానికి 'బ్లేమ్' అనే పదాన్ని వాడటం మాకు నచ్చదు.. సీఓఈ, టీమ్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ (SSM) టీమ్, సెలెక్షన్ కమిటీ మధ్య అద్భుతమైన సమన్వయం ఉంది. ప్రతి రిపోర్టు అత్యంత పారదర్శకంగా, డేటా ఆధారంగానే తయారవుతుందని స్పష్టం చేశారు.
ఆస్టరిస్క్ గుర్తు వెనుక ఉన్న అసలు నిజం:
* సబ్జెక్ట్ టు ఫిట్‌నెస్ (Subject to Fitness): బీసీసీఐ ప్రెస్ రిలీజ్‌లో ఆటగాడి పేరు పక్కన స్టార్ (*) మార్క్ ఉందంటే.. ఆ ప్లేయర్ ఫిట్‌నెస్‌కు లోబడి మాత్రమే ఎంపికయ్యాడని అర్థం.
* బుమ్రా, సాయి సుదర్శన్ కేస్: జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఎంపిక చేసినప్పుడు కూడా ఈ కండిషన్ ఉంది. వారు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంలో రికవరీ నెమ్మదించడంతో కోచ్, సెలెక్టర్లకు ముందే సమాచారం ఇచ్చి సిరీస్ నుంచి మినహాయించామని పేర్కొన్నాడు.
* పారదర్శక ప్రక్రియ: సెలెక్టర్లు స్టేటస్ రిపోర్ట్ అడిగినప్పుడు సీఓఈ నుంచి హెడ్ కోచ్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్, బీసీసీఐలకు అధికారిక నివేదిక వెళ్తుంది. ఇది ప్రాథమిక విచక్షణ (Basic common sense) ఉన్న ఎవరికైనా అర్థమవుతుందని వీవీఎస్ లక్ష్మణ్ చురకలు అంటించారు.
Bengaluru, Karnataka: Former Cricketer VVS Laxman says, "In fact, you covered a lot of important points here and a lot of familiar faces. I think I really first thank all of you on a Sunday morning to come here to understand what we at the COE do. As Devajit rightly mentioned,… pic.twitter.com/mRRujlSRlK
— IANS (@ians_india) August 9, 2026
Bengaluru, Karnataka: BCCI Secretary Devajit Saikia says, "On behalf of BCCI, I welcome each one of you to this special meeting at COE Bangalore....You have managed to come here and be with us where we are going to give you a presentation of our COE which BCCI has established two… pic.twitter.com/EXa2iGhOG9
— IANS (@ians_india) August 9, 2026
