Good Health : రాత్రులు హాయిగా నిద్రపోవాలంటే.. ఇలా చేయండి

Good Health : రాత్రులు హాయిగా నిద్రపోవాలంటే.. ఇలా చేయండి

చాలామంది రాత్రిళ్లు నిద్రరాక ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా మంచిగా నిద్ర పట్టాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో కావాలి... అవేంటో చూసేద్దామా మరీ..

* నిద్రపోయేముందు చాలామంది ఫోన్, ల్యాప్ లు పట్టుకు కూర్చుంటారు. 

* రాత్రి టైంలో స్క్రీన్ ముందు ఉండటం వల్ల దాని నుంచి వచ్చే బ్లూ లైట్ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడుతుంది. 

* దీని వల్ల నైట్ అయ్యిందనే సంగతి బ్రెయిన్ గుర్తించదు.

* కాబట్టి నిద్రపోవాలనుకునే ముందు స్క్రీన్ కి దూరంగా ఉండాలి.

* అరికాళ్లను మెల్లగా మసాజ్ చేయాలి. 

* మ్యూజిక్ పెట్టుకొని, కళ్లు మూసుకుని ఊపిరి మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది. 

* స్లీపింగ్ మ్యూజిక్స్ అనియూట్యూబ్లో సెర్చ్ చేస్తే అనేక రకాల స్లీపింగ్ మ్యూజిక్స్ వస్తాయి. 

* వాటిని వింటే తెలియకుండానే నిద్రలోకి జారుకోవచ్చు. 

* కెఫిన్ ఉన్న కాఫీ, చాయ్ సాయంత్రాలు తాగొద్దు. 

* కావాలంటే నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగొచ్చు.

* రోజూవారి స్లీప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. 

* రోజూ ఒకే టైంకి పడుకోవాలి.. నిద్రలేవాలి. 

* ఈ అలవాటు వల్ల మంచి నిద్ర పడుతుంది.