ఇల్లు తుడవడానికి పాత బట్టలు వాడుతున్నారా ? ఇలా చేస్తే ఆర్ధిక సమస్యలు, అనారోగ్యం వస్తాయా !

ఇల్లు తుడవడానికి పాత బట్టలు వాడుతున్నారా ? ఇలా చేస్తే ఆర్ధిక సమస్యలు, అనారోగ్యం వస్తాయా !

ఇల్లు తుడవడానికి పాత బట్టలు వాడుతున్నారా ? అయితే వెంటనే ఈ అలవాటు మార్చుకోవాల్సిందే ! వాస్తు శాస్త్రం ప్రకారం పాత బట్టలతో ఇల్లు తుడుచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 

మనలో చాలా మంది ఇళ్లలో పాత టీ-షర్టులు, టవల్స్, చిరిగిపోయిన బెడ్‌షీట్లు పనికిరావని పారేయకుండా.. నేల తుడిచే గుడ్డలుగా మారుస్తుంటాం. ఇలా చేయడం డబ్బు ఆదా చేసే మంచి పద్ధతిలా అనిపించినా, వాస్తు శాస్త్రం ప్రకారం చాలా పెద్ద పొరపాటు.

వాస్తు ఏం చెబుతోంది?
*
వాస్తు శాస్త్రంలో "జిర్నా వస్త్రేషు దరిద్రత నివాసతి" అనే ఒక మాట ఉంది. దీని అర్థం ఏంటంటే.. చిరిగిన లేదా పనికిరాని బట్టలు ఎక్కడైతే ఉంటాయో, ఆ ఇంట్లోకి దరిద్రం, పేదరికం వస్తాయి.

*మనం ధరించే బట్టలకు మన శరీర శక్తి, వైబ్రేషన్స్ అంటుకుని ఉంటాయి. అలాంటి బట్టలను నేల మీద ఉన్న మురికిని శుభ్రం చేయడానికి వాడినప్పుడు, ఇంట్లోకి ప్రతికూల శక్తి (Negative Energy) ప్రవేశిస్తుంది.

* ఈ చిన్న అలవాటు వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని, మానసిక ఒత్తిడి, అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

 పరిహారం ఏంటి 
పాత బట్టలను ఇల్లు తుడవడానికి వాడే బదులు.. వాటిని ఉప్పు నీటితో ఉతికి, ఎవరికైనా దానం చేయడం మంచిది.

మరి నేల తుడవడానికి ఎలాంటివి వాడాలి?
ఇంట్లో సుఖశాంతులు, పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే నేల తుడవడానికి ఎప్పుడూ కొత్త కాటన్ గుడ్డలను లేదా మార్కెట్లో దొరికే ప్రత్యేకమైన వైప్స్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయడం వాస్తు పరంగానూ, ఆరోగ్య పరంగానూ కూడా చాలా మంచిది.