రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?

రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?

ఎక్స్‌‌పర్ట్స్ స్టడీ ప్రకారం.. ఒకరోజులో సాధారణంగా300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ తినకూడదు.ఒక గుడ్డులో373 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది.కాబట్టి.. గుండె సమస్యలున్నవాళ్లు గుడ్డును తినడం మంచిదా కాదా.. తింటేరోజుకు ఎన్ని గుడ్లు తినాలి? బరువు పెరగాలనుకునేవారు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యం? అనేప్రశ్నలకు సమాధానాలేంటో తెలుసుకుందాం.

* ఆస్పత్రిలో కన్నుమూసి.. అంత్యక్రియల్లో కళ్లు తెరిచింది

* పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా

రోజుకు ఒక గుడ్డు బెటర్

పిల్లల నుంచి పెద్దల వరకు, పేషెంట్లు, గర్భిణులు ఇలా ఎవరైనాసరే ..రోజుకు ఒకగుడ్డు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఒక సంస్ నిర్వహించిన మూడు ఇంటర్నేషనల్   స్టడీల అనాలిసిస్ లో  వెల్లడైంది. 21 దేశాల్లో,ఒక లక్షా 46 వేలమందిని స్టడీచేసి ఈ రిపోర్టు తయారుచేశారు. ఇందులో రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువ గుడ్డును తినేవారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ బారిన  పడలేదని ఎక్స్ పర్స్ట్ గుర్తించారు. అయితే బరువు పెరగాలనుకున్న వాళ్లు మాత్రం రోజుకు మూడు వరకు గుడ్లు తినొచ్చు. డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనని, రోజుకు ఒకటి కంటే ఎక్కువ గుడ్లను తింటే ప్రమాదమని సర్వేలో తేలింది. గుండె జబ్బులున్నవాళ్లు రోజుకు తినేగుడ్ల సంఖ్య ఎంత పెరిగితే ముప్పుకూడా అంతే పెరుగుతుందని తేల్చారు.

* వినియోగ‌దారుల‌కు జియో బంప‌ర్ ఆఫ‌ర్.. ఏడాది పాటు

* నిజామాబాద్ లో దారుణం.. యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్

హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు జాగ్రత్త

రోజుకు ఒకగుడ్డు తినడం పూర్తిగా ఆరోగ్యకరమని,షుగర్.. గుండె సమస్యలను డెవలప్ చేయడంలో ఇది ఎలాంటి ప్రభావం చూపదని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.అంటే.. షుగర్, గుండె సమస్యలున్నపేషెంట్లు కూడా రోజుకు ఒకగుడ్డునుతినొచ్చని చెప్తున్నారు. నిజానికి కొంతమంది రోజుకు రెండు మూడు గుడ్లు తిం టుంటారు. అలాంటి వారిలోబరువు పెరగాలనుకునే వారికయితే ఎలాంటి ప్రమాదం లేదని,షుగర్.. గుండె సమస్యలున్నవారిపై మాత్రం ఎఫెక్ట్పడుతుందని చెప్తున్నారు.