IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బౌలర్లకి చుక్కలు కనిపిస్తున్నాయి. మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఏకంగా మూడింట్లో ఇరు జట్లు 200+ స్కోర్లు సమర్పించుకున్నాయి. రెండో టీ20లో భారత్ 249/5 రన్స్ చేసినప్పటికీ, విండీస్ బ్యాటర్లు ఊచకోత కోసి 9 బంతులు మిగిలి ఉండగానే ఆ టార్గెట్‌ను ఛేదించారు. ఇక నాలుగో టీ20లోనూ కరేబియన్ టీమ్ 247 పరుగులు బాదింది. ఈ బ్యాటింగ్ ఉతుకుడుపై భారత మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బౌలర్లను కాపాడుకోవడానికి బీసీసీఐ ముందుకు వచ్చి బ్యాట్, బాల్ మధ్య సమాన పోటీ ఉండే పిచ్‌లను తయారు చేయాలని కోరారు.
బౌలర్లని భయపడేలా చేయకండి:
ANIతో చేతన్ శర్మ మాట్లాడుతూ.. మైదానాల్లో కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే కాకుండా బౌలర్లకు కూడా కాస్త గౌరవం దక్కాలని అభిప్రాయపడ్డారు. పిచ్‌ల విషయంలో కొద్దిగా మార్పులు అవసరం. ప్రేక్షకులు ఫోర్లు, సిక్సర్లు చూడాలనుకుంటారని నాకు తెలుసు, కానీ దయచేసి బౌలర్లపై కూడా కొంచెం దృష్టి పెట్టండి అని కోరారు. బౌలర్లని బలి చేయడానికి నేను ఒప్పుకోను, కానీ వాళ్లు మైదానంలోకి రావడానికి భయపడేంతలా బాదకండి.. ఆరోగ్యకరమైన పోటీ చాలా ముఖ్యం.. దేశవాళీ క్రికెట్లో లాగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ బౌలింగ్‌కు సహకరించే సమతుల్య వికెట్లు ఇవ్వాలి.. ఒక జట్టు 400 కొడితే, ఇంకో జట్టు దాన్ని మరో 6 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించడం మరీ దారుణంగా ఉందన్నాడు.
2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఆడాలి:
* ఇదే సమయంలో భారత దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ల 2027 వన్డే ప్రపంచ కప్ ప్రాతినిధ్యంపై చేతన్ శర్మ పూర్తి మద్దతు తెలిపారు.
* వయసుతో సంబంధం లేదు: వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్, విరాట్ ఇద్దరూ సెంచరీలు బాది అద్భుతమైన ఫామ్‌లో కనిపించారు. వారు దేశం కోసం పరుగులు చేస్తూ మ్యాచ్‌లు గెలిపిస్తున్నప్పుడు, బయట నుంచి వచ్చే వందలాది అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ALSO READ : ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్.. ఐపీఎల్‌కి స్టార్ బౌలర్ దూరం..
* వన్డేల్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 15,109 పరుగులు (55 సెంచరీలు), రోహిత్ శర్మ 12,120 పరుగులు (35 సెంచరీలు) సాధించి 2027 ప్రపంచ కప్ కోసం భారత్‌కు ప్రధాన తూపాలుగా కొనసాగుతున్నారు.
