ఇంటిని నిర్మించుకున్న.. కొత్తగా ఇల్లు కొనుకున్నా.. సాధారణంగా కలర్స్ వేయించుకుంటాం. ఇంట్లో గోడలకు మన అభిరుచిని బట్టి రంగులు వేస్తాం. కాని మెయిన్ డోర్ కు మాత్ర కొన్ని రంగులు మాత్రమే వాడాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఏ దిక్కులో ఉన్న మెయిన్ డోర్ కు ఎలాంటి రంగులు వాడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
వాస్తు సిద్దాంతం ప్రకారం.. ఇంట్లోకి పాజిటివ్ఎనర్జీ వచ్చినా.. నెగిటివ్ ఎనర్జీ వచ్చినా ప్రధాన ద్వారంతోనే ఇంట్లోకి వస్తాయి. అందుకే ఇంటి ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంది.. ఎలా ఉంది. ఏ చెక్కతో చేయించాలి.. ఏరంగా వేయాలి.. అనే అంశాలు కూడా వాస్తు సిద్దాంతంలో కీలకపాత్ర పోషిస్తాయి. మెయిన్ డోర్ ఉన్న దిక్కును బట్టి తలుపుల రంగును వాడాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయంటున్నారు వాస్తు ఎక్స్పర్ట్స్
ప్రధాన ద్వారం వాస్తు విషయంలో దోషాలుంటే.. ఆ ఇంటి యజమాని ఎన్ని పూజలు చేసినా కలిసి రాదు. శాంతి.. జపం.. హోమాల ద్వారా పూర్తి పరిష్కారం లభించదు. కేవలం ఉపశమనం మాత్రమే పొందుతారు. మెయిన్ డోర్ వాస్తు ప్రకారం లేకపోయినా.. దిక్కును బట్టి రంగులు లేకపోయినా ఆర్థిక .. ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
తూర్పు దిక్కు : ఈ దిక్కులో మెయిన్ డోర్ ఉంటే తలుపు సహజంగా ఉండాలి. నాచురల్ వుడ్ కలర్ బాగా కలిసి వస్తుంది. సుఖ శాంతులను తీసుకువస్తుంది. కృత్రిమ రంగుల కంటే సహజమైన రంగులు వాడడం మంచిదని పండితులు చెబుతున్నారు.
పడమర మెయిన్ డోర్ : వాస్తుప్రకారం ఈ దిక్కులో మెయిన్ డోర్ ఉన్న ఇంట్లో నివసించే వారు అదృష్టవంతులని పండితులు చెబుతున్నారు. సాధారణంలో పడమర దిక్కుపై శని ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. శని అశుభ దృష్టి పడకుండా ఉండాలంటే ఈ దిక్కులో ఉన్న మెయిన్ డోర్ కు నీలిరంగు వేయించుకోవాలి. శని భగవానుడికి నీలి రంగు అంటే చాలా ఇష్టం. ఇలా చేయడం వలన శని దేవుని అనుగ్రహంతో ఏ ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.
ఉత్తర దిశలో మెయిన్ డోర్ : ఈ దిశలో ప్రధాన ద్వారం ఉంటే తలుపులకు లేత ఆకుపచ్చ రంగు ఉంటే చాలా మంచిది. నార్త్ ఫేసింగ్ ఇంటికి కచ్చితంగా తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఇక ఐశ్వర్యం పెరగాలంటే ఈ దిక్కులో వాటర్ సంప్.. బావి.. బోరు వంటివి ఉండాలి.
దక్షిణ దిశ: ఈ దిక్కులో మెయిన్ డోర్ ఉంటే గులాబీరంగులో ఉండాలి. సహజంగా ఈ రంగులను జనాలు ఇష్టపడరు. ఒకవేళ రంగులు వేయించుకోలేని పక్షంలో కనీసం డోర్ హ్యాండిల్స్ అయినా ఈ రంగులో ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాల నుంచి విమక్తి కలిగే అవకాశం ఉంది.
ఈశాన్య దిశ : ఈ దిశలో ఉండే డోర్ కు పసుపు లేదా గ్రీన్ కలర్ వేయాలి. ఇలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగి.. ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది.
వాయువ్య దిశ : ఈ దిశలో ఉన్న డోర్ లకు తెలుపు రంగు వేయాలి. ఇంట్లో అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఇలా చేయడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని.. అనేక రకాలుగా ప్రయోజనం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు
నైరుతి దిశ: ఈ దిశలోని డోర్ నకు వెండి రంగు వేయాలి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది.
ఆగ్నేయ దిశ: ఈ దిశలో ఉన్న డోర్ కు ముదురు రంగులు వేయాలి. ఇలా చేయడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్నివాస్తు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
