మాది డబుల్ ఇంజన్.. కాంగ్రెస్‌‌ది లూట్ ఇంజన్

మాది డబుల్ ఇంజన్.. కాంగ్రెస్‌‌ది లూట్ ఇంజన్

బొకాఖత్: అస్సాంలో రెండోమారు బీజేపీనే అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బొకాఖత్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ.. అస్సాంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రాబోతోందన్నారు. డబుల్ ఇంజన్ అంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎల్పీజీ, ఎలక్ట్రిసిటీ, ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు. అస్సాంను అభివృద్ధి బాటలో నడపడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ అంటే కన్ఫూజన్, బాంబ్, బంద్‌‌బుక్ పార్టీ అంటూ కామెంట్ చేశారు. లూటీలో ముందుగా ఉండే కాంగ్రెస్ ఇంజన్ నుంచి ప్రజలు దూరంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు.