17 ఏళ్ల తర్వాత పెద్ది కోసం ఫిల్మ్ నెగెటివ్‌‌‌‌ను వాడాం: డీవోపీ రత్నవేలు

17 ఏళ్ల తర్వాత పెద్ది కోసం ఫిల్మ్ నెగెటివ్‌‌‌‌ను వాడాం: డీవోపీ రత్నవేలు

‘‘పెద్ది’ చిత్రంలో క్రికెట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌పై చూస్తుంటే రెండు జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది. రామ్ చరణ్‌‌‌‌ సెటిల్డ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌ ఇచ్చారు.  ఆయన ఇంటెన్సిటీని ప్రేక్షకులు ఖచ్చితంగా ఎక్స్‌‌‌‌పీరియన్స్ చేస్తారు’ అని చెప్పారు డీవోపీ రత్నవేలు. రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సానా డైరెక్షన్‌‌‌‌లో వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.  ఈ సందర్భంగా డీవోపీ రత్నవేలు ఇలా ముచ్చటించారు.  

కొవిడ్ తర్వాత సినిమా ట్రెండ్ మారింది. ప్రేక్షకులు రియలిజాన్ని కోరుకుంటున్నారు. అందుకే ‘పెద్ది’ కోసం రియలిస్టిక్ ఫీలింగ్ ఉన్న విజువల్స్‌‌‌‌ను క్రియేట్ చేశాం. నలభై ఏళ్ల క్రితంనాటి విజయనగరం కథను విజువల్‌‌‌‌గా ఎంత అందంగా చెప్పాలనేది ముందుగా ప్లాన్ చేశాం. అప్పటి ప్రజలు ఒక కలర్‌‌‌‌‌‌‌‌ను ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ చేసి ఉంటారు. ఆ ఫీల్‌‌‌‌ను రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాం. చివరి ఫ్రేమ్ వరకు కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం.

 సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. కథలో అదొక పెద్ద మలుపు. దాన్ని నైట్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌లో చేద్దామని బుచ్చిబాబుకు సూచించాను.  80లలో ఫ్లడ్‌‌‌‌లైట్ మ్యాచ్‌‌‌‌లు జరిగేవి. ఆ మూడ్ కోసం నైట్ షూట్ అయితే బాగుంటుందని అనిపించింది. షూటింగ్ తర్వాత చరణ్ గారు వచ్చి “అద్భుతమైన ఆలోచన, ఈ సీన్‌‌‌‌తో సినిమా నెక్స్ట్‌‌‌‌ స్టేజ్‌‌‌‌కు వెళ్లింది’ అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

కుస్తీ పోటీలు మరో పెద్ద ఛాలెంజ్. కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్‌‌‌‌తో పాటు ప్రతి మజిల్‌‌‌‌ను డెవలప్ చేసి, ఒక రియల్ పహిల్వాన్‌‌‌‌లా కనిపించారు. హనుమంతుడి రిఫరెన్స్‌‌‌‌తో వచ్చే ఒక సీక్వెన్స్ థియేటర్‌‌‌‌లో చూసినప్పుడు గూస్‌‌‌‌బంప్స్ వస్తాయి. చరణ్‌‌‌‌లో ఒక హనుమంతుడిని ఫీల్ అవుతారు. తన ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్ నిజంగా అద్భుతం. ఒక కథను 60 శాతం స్క్రీన్ మీదకు తెస్తే సూపర్ హిట్ అంటారు. కానీ బుచ్చిబాబు 200 శాతం స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు.

ఢిల్లీలో తీసిన సీన్స్‌‌‌‌ నాకు చాలా ఫేవరెట్.  లైట్ లేకుండా షూట్ చేశాను. దాని కోసం  దాదాపు 17 ఏళ్ల తర్వాత తెలుగులో మళ్లీ ఫిల్మ్ నెగెటివ్‌‌‌‌ను ఉపయోగించాం. డిజిటల్ కెమెరాల ఔట్‌‌‌‌పుట్ బాగున్నా,  ఒక రియల్ ఫీల్ కోసం ఫిల్మ్ నెగెటివ్ వాడాం.  శ్రీలంకలో ఇంతవరకూ ఎవరూ షూట్ చేయని లొకేషన్స్‌‌‌‌లో షూట్ చేశాం.  అక్కడి రైల్వే ట్రాక్‌‌‌‌ మమ్మల్ని ఎగ్జైట్ చేసింది. అక్కడో వాటర్‌‌‌‌ఫాల్ సీక్వెన్స్ కూడా ఉంది. 

‘పెద్ది’ క్లైమాక్స్ చాలా ఛాలెంజింగ్. విజువల్ గ్రాండియర్‌‌‌‌తో పాటు ఎమోషనల్ హై కూడా ఉంటుంది. చివరి 30 నిమిషాలు ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ అవుతారు. ఇక త్వరలో డైరెక్షన్‌‌‌‌ చేయబోతున్నా. ఇప్పటికే మూడు కథలు రాశా.  మంచి ఎమోషన్‌‌‌‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ తీస్తా.