రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో దీనిని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు డబుల్ ట్రీట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి ‘పెద్ది’ సినిమా గురించి కాగా, మరొకటి సుకుమార్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ కావడం విశేషం.
‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఆ అంచనాలను రీచ్ అయ్యేలా చరణ్ బర్త్ డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మూవీ ఓపెనింగ్, షూటింగ్ డీటెయిల్స్ రివీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చరణ్ కెరీర్‌లో ఇది 17వ సినిమా. ఇక ఇప్పటికే రెండు పాటలతో ప్రమోషన్స్‌లో జోరు చూపించిన ‘పెద్ది’ నుంచి చరణ్ బర్త్ డే కానుకగా టీజర్ రాబోతుందని సమాచారం. ఈ రెండు సర్‌ప్రైజ్‌ల కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
