యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే (మే 20) అంటేనే అభిమానులకు ఒక పూనకం. ఇక ఆ పుట్టినరోజుకు ఒకరోజు ముందే బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్ అప్‌డేట్ వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. నిన్న ( మే 18, 2026 ) రిలీజ్ అయిన మెగాస్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ సృష్టించిన ఊచకోత తర్వాత, ఇప్పుడు అందరి కళ్లూ ఆర్‌ఆర్‌ఆర్(RRR) కాంబోలోని తారక్ తదుపరి చిత్రం పైనే ఉన్నాయి. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘NTRNeel’ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్ వచ్చేసింది.
డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ టైమ్..
ఈ చిత్రానికి “డ్రాగన్” (Dragon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ రాత్రి (మే 19) సరిగ్గా 11:52 గంటలకు ‘గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్’ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌తో పాటు, ఎంపిక చేసిన థియేటర్లలో మిడ్‌నైట్ స్క్రీనింగ్స్‌తో రచ్చ చేయబోతోంది. తారక్ బర్త్‌డేకి కేవలం 8 నిమిషాల ముందే ఈ విధ్వంసం మొదలుకానుంది. ఇప్పటికే అభిమానులు సంబరాలకు రెడీ అయ్యారు.
షాకింగ్ రన్ టైమ్..
సాధారణంగా టీజర్లు నిమిషం కంటే తక్కువ ఉంటాయి. కానీ ప్రశాంత్ నీల్ ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల సుదీర్ఘ రన్‌టైమ్‌తో ఈ గ్లింప్స్‌ను కట్ చేయడం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది. ఇందులోనే సినిమా కథా నేపథ్యం, నీల్ సృష్టించిన సరికొత్త ఊహాజనిత ప్రపంచాన్ని చూపించబోతున్నారు. సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి ఇప్పటికే ఈ గ్లింప్స్‌కు U/A 16+ సర్టిఫికెట్ వచ్చింది. దీన్ని బట్టే అర్థమవుతోంది.. ఇందులో వయొలెన్స్, యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో. ఈ 4.5 నిమిషాల వీడియోలో దాదాపు ఒక నిమిషం పాటు ఎన్టీఆర్ రౌద్రరూపం, గర్జించే అవతారంలో వెండితెరను రూల్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
క్రేజీ కాస్టింగ్ ..
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కన్నడ క్రష్ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌తో టాక్స్ నడుస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా రెండు భాగాలుగా (2 Parts) రాబోతోందనే సరికొత్త గుసగుస కూడా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
కేజీఎఫ్, సలార్ చిత్రాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రూర్, ఈ చిత్రానికి కూడా తన ‘మైదాస్ టచ్’తో థియేటర్లను దద్దరిల్లేలా చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేయగా, ఈ రాత్రి రాబోయే విజువల్ వండర్ టాలీవుడ్ రికార్డులను ఎలా తిరగరాస్తుందో చూడాలి. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
These are the grounds where the destruction protocol activates 🔥#NTRNeel First Glimpse today at 11:52PM IST. pic.twitter.com/xs9SeBLvBp
— #NTRNeel (@NTRNeelFilm) May 19, 2026
