రికార్డుల వేటలో డ్రాగన్ గ్లింప్స్.. నాని ఆయా షేర్ను బీట్ చేస్తుందా !

రికార్డుల వేటలో డ్రాగన్ గ్లింప్స్.. నాని ఆయా షేర్ను బీట్ చేస్తుందా !

పాన్ ఇండియా మూవీ డ్రాగన్ రిలీజ్ కు ముందే పెద్ద బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ రోజు.. 24 గంటల్లోనే 64 మిలియన్ వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆగకుండా ట్యూబ్ లో దూసుకుపోతోంది. 

1967 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న డ్రాగన్.. అండర్ వరల్డ్ కు సంబంధించి పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసింది. గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో ఓపియమ్ (Opium)  మాదకద్రవ్యాల అక్రమ రవాణా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీతో అసోసియేట్ అయిన భయంకరమైన డ్రగ్ మాఫియా గురించి ఈ సినిమా నడుస్తుందని టాక్. 

అయితే 24 గంటల్లోనే 64 మిలియన్స్ వ్యూ్స్ సాధించిన డ్రాగన్ గ్లింప్స్.. ప్రస్తుతం యూట్యూబ్ లో 100 మిలియన్ మార్క్ చేరుకుంది. నాని ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ రికార్డ్స్ ను బీట్ చేసే దిశగా వెళ్తుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. 

  • దూసుకుపోతున్న ఆయా షేర్.. 

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్యారడైజ్ మూవీ లో ఆయా షేర్ పాట ఎంత బజ్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. అనిరుధ్ రవిచంద్రన్ కంపోజింగ్ కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాట 150 మిలియన్ వ్యూస్ తో, 1.6 మిలయన్ లైక్స్ తో  నాని కెరీర్ లో నే టాప్ సాంగ్ గా దూసుకుపోతోంది.