తెలంగాణలో తాగునీటి ముప్పు.. 500 ఆవాసాల్లో తీవ్ర నీటి ఎద్దడి

తెలంగాణలో తాగునీటి ముప్పు.. 500 ఆవాసాల్లో తీవ్ర నీటి ఎద్దడి
  •     ఇప్పటికే 500 ఆవాసాల్లో తీవ్ర నీటి ఎద్దడి
  •     సమస్యాత్మక గ్రామాలు, పట్టణాలపై అప్రమత్తం
  •     ప్రత్యామ్నాయ మార్గాలపై త్వరలో నివేదిక
  •     ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గకుండా చర్యలు 

హైదరాబాద్, వెలుగు: ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో తాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. నైరుతిలో వర్షాలు ముఖం చాటేయడం,  లోటు వర్షపాతం నమోదు కావడంతో నదులు, ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రవాహాలు తగ్గడం వల్ల ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 76 ఇన్‌‌‌‌టేక్ వెల్స్​వద్ద నీటి లభ్యత తగ్గుతోంది. దీంతో పంపింగ్ సామర్థ్యం పడిపోయి, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 500 హ్యాబిటేషన్లకు నీటి సరఫరాలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. పరిస్థితి మరింత జటిలం కాకుండా ఉండేందుకు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సమస్యాత్మక ఆవాసాలు, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ వనరులపై వివరాలతో నివేదికలు పంపాలని ఆదేశించింది.

ఇన్​టేక్​వెల్స్​ వద్ద లో ప్రెజర్ 

 మిషన్​భగీరథ పథకం కింద రూరల్​లో 24వేల ఆవాసాల్లోని దాదాపు 53 లక్షల ఇండ్ల నల్లా కనెక్షన్లకు నీటిని అందించాల్సి ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 135 నుంచి 150 ఎల్​పీసీడీ మేర బల్క్ సరఫరా కొనసాగించాల్సి ఉంది. జలాశయాల్లో, భూగర్భంలో నీటిమట్టాలు తగ్గడం వల్ల మిషన్ భగీరథ పంపిణీ వ్యవస్థలోని సాంకేతిక విభాగాలపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 123 వాటర్ ట్రీట్‌‌మెంట్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో శుద్ధి ప్రక్రియను కొనసాగించేందుకు అవసరమైన నీటి ప్రవాహం తగ్గినట్లు స్పష్టం చేస్తున్నారు.

61,187 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన గ్రిడ్ , 71,315 కిలోమీటర్ల ఇంట్రా-విలేజ్ పైప్‌‌లైన్ నెట్‌‌వర్క్‌‌లో పంపింగ్ సాఫీగా సాగేందుకు ప్రెజర్​ను కొనసాగించేందుకు మిషన్​భగీరథ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 35,385 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు (ఓహెచ్ఎస్సార్లు), 1,091 బీపీటీలు, 775 సంపులకు నిరంతరాయంగా నీటిని చేరవేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. గ్రిడ్ నెట్‌‌వర్క్‌‌లో భాగంగా ఉన్న 2,676 ఎల్టీ పంపుసెట్లు, 414 హెచ్టీ పంపుసెట్లు నిరంతరం పనిచేసేందుకు 220 కేవీ సబ్‌‌స్టేషన్లు 2, 33 కేవీ సబ్‌‌స్టేషన్లు 46, 11 కేవీ సబ్‌‌స్టేషన్లు 279 సహా 443 ఎల్టీ కేంద్రాల ద్వారా విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లోపిస్తే ఇంతటి భారీ మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ నిర్దేశిత పరిమాణంలో తాగునీటిని అందించడం సవాల్​గా మారుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

లీజుకు ప్రైవేటు బోర్లు

లోటు వర్షపాతం నమోదవడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 56,134 చేతిపంపులు, 47,626 సింగిల్ ఫేజ్ మోటార్లు, 30,012 పీడబ్ల్యూఎస్ త్రీ-ఫేజ్ మోటార్లలో నీటి లభ్యత తగ్గుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 7,250 బహిరంగ బావుల్లో నీటిమట్టాలు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉమ్మడి మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో ప్రైవేట్ వ్యవసాయ బోర్లను గుర్తించి లీజు ప్రాతిపదికన తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు ఏర్పడే కుగ్రామాలు, ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ సరఫరా చేసేందుకు రవాణా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.


ప్రాజెక్టుల పరిస్థితి ఇది

రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది.  ఉత్తర తెలంగాణకు ఆధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 47 టీఎంసీల మేరకే నీరు లభ్యమవుతోంది. దీంతో వ్యవసాయానికి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేసి, ఉన్న నిల్వలను కేవలం తాగు అవసరాలకే రిజర్వ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ శివార్లతో పాటు పలు జిల్లాలకు నీరందించే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 18.06 టీఎంసీల నిల్వ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ దాహార్తిని తీర్చే సింగూరు జలాశయంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 29.91 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 4.47 టీఎంసీలే మిగిలాయి. ఇక మంజీరా జలాశయంలో 1.5 టీఎంసీలకు గానూ కేవలం 0.75 టీఎంసీల నీరు మాత్రమే డ్యాంలో ఉంది. దక్షిణ తెలంగాణకు జీవనాధారమైన నాగార్జునసాగర్‌‌లో 312 టీఎంసీల గరిష్ఠ స్థాయికి గానూ ప్రస్తుతం 182.74 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎండకాలం  టైంలో రాష్ట్రానికి కనీసం 60 నుంచి 70 టీఎంసీల తాగునీరు అవసరం కాగా,  అంతకంటే ముందే జలాశయాలు ఎమర్జెన్సీ డ్రా అవుట్ (డెడ్ స్టోరేజ్) స్థాయికి చేరకుండా కాపాడుకోవడం అధికారులకు  సవాలుగా మారింది.

లీజుకు ప్రైవేటు బోర్లు

లోటు వర్షపాతం నమోదవడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 56,134 చేతిపంపులు, 47,626 సింగిల్ ఫేజ్ మోటార్లు, 30,012 పీడబ్ల్యూఎస్ త్రీ-ఫేజ్ మోటార్ల బోర్లలో నీటి లభ్యత తగ్గుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 7,250 బహిరంగ బావుల్లో నీటిమట్టాలు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో ప్రైవేట్ వ్యవసాయ బోర్లను గుర్తించి లీజు ప్రాతిపదికన తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.