Drishyam 3 OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'దృశ్యం 3'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Drishyam 3 OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'దృశ్యం 3'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్‌ల మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ ఫ్రాంచైజీ 'దృశ్యం'. సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ సిరీస్ నుండి వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ 'దృశ్యం 3'. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. జార్జ్‌కుట్టి మైండ్ గేమ్‌ బాక్సాఫీస్ షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 236 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇప్పుడీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ థియేట్రికల్ రన్ ముగించుకుని, డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 18 నుండి 'దృశ్యం 3' స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి రాబోతోంది.

 

ఉత్కంఠ భరితంగా!

'దృశ్యం 2' ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచే 'దృశ్యం 3' అసలు ఆట మొదలవుతుంది. కోర్టు తీర్పుతో వరుణ్ హత్య కేసు నుండి జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్) ఫ్యామిలీ తాత్కాలికంగా బయటపడుతుంది. తన జీవితంలో జరిగిన ఈ సంచలన ఘటనలనే కథగా మార్చి జార్జ్ నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న టైమ్‌లో, ఆ గతం మళ్లీ నీడలా వెంటాడుతుంది. ట్రామా నుండి కోలుకున్న పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని జార్జ్, రాణి (మీనా) భావిస్తారు. కానీ, వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ వింతగా రద్దవుతుంటాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అంజు గతం గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని జార్జ్‌కుట్టికి అర్థమవుతుంది.

ట్విస్ట్‌ల వెనుక ట్విస్ట్‌లు

కొడుకును కోల్పోయిన బాధతో అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్ (ఆశా శరత్), ప్రభాకర్ (సిద్ధిఖీ) మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? సస్పెండ్ అయిన కరడుగట్టిన పోలీస్ ఆఫీసర్ సహదేవన్ (మురళీ గోపి) వేసిన కొత్త వ్యూహం ఏంటి? ఈసారి పోలీస్ డిపార్ట్‌మెంట్ జార్జ్‌కుట్టిని ఎలా లాక్ చేసింది? ఖైదీగా మారిన జార్జ్‌కుట్టి చుట్టూ పోలీసులు ఎలా పద్మవ్యూహం పన్నారు? తన కుటుంబాన్ని శాశ్వతంగా కాపాడుకోవడానికి జార్జ్‌కుట్టి వేసిన ఆ ‘అంతిమ వ్యూహం’ (Ultimate Masterplan) ఏంటి? అనేదే ‘దృశ్యం 3’ క్లైమాక్స్.

జీతూ జోసెఫ్ మార్క్ స్క్రీన్‌ప్లే, మోహన్‌లాల్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, ఈ మైండ్-బెండింగ్ థ్రిల్లర్‌ను థ్రిల్ ఫీల్ అవ్వడానికి జూన్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయండి.