చలాన్ తప్పించుకునేందుకు బానెట్‎పై పోలీస్‎తో దూసుకెళ్లిన డ్రైవర్

చలాన్ తప్పించుకునేందుకు బానెట్‎పై పోలీస్‎తో దూసుకెళ్లిన డ్రైవర్

ముంబైలోని అంధేరీలో ఓ వాహనదారుడు రెచ్చిపోయాడు. చలాన్ తప్పించుకునేందుకు ట్రాఫిక్ పోలీస్ బానెట్ పై ఉండగానే కారుతో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీసు కారు బానెట్ పై ఉండగానే కారుతో కిలోమీటర్ దూరం వెళ్లాడు. ఆజాద్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన కారును ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ సింగ్ ప్రయత్నించారు. కానీ కారు ఓనర్ మాత్రం ఆపకుండా దూసుకెళ్లాడు. దీంతో కానిస్టేబుల్.. కారు బానెట్ పై దూకాడు. అతనితో కొంతదూరం అలాగే వెళ్లాక కానిస్టేబుల్ కిందపడిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.