నా ప్రొడక్షన్‌లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది: దుల్కర్ సల్మాన్

నా ప్రొడక్షన్‌లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది: దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తూ నిర్మించిన   మలయాళ చిత్రం ‘ఐ యామ్ గేమ్’.  నహాస్ హిదాయత్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సెప్టెంబర్ 3న తెలుగులోనూ విడుదలవుతోంది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ నిర్వహించారు. అతిథిగా హాజరైన  డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్‌‌గా ఉంది. ఇందులోని కాన్సెప్ట్‌‌కు ఆడియన్స్ సర్‌‌‌‌ప్రైజ్ అవుతారు.  

తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అని అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘నా ప్రొడక్షన్‌‌లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. స్ట్రయిట్‌‌ తెలుగు సినిమాలా ఉంటుంది.  తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పా.  నాగ్ అశ్విన్‌‌ ఎడిటింగ్‌‌లో హెల్ప్‌‌ చేశారు.  కచ్చితంగా అందర్నీ అలరిస్తానని నమ్ముతున్నా’ అని చెప్పాడు.  ఇది తనకు స్పెషల్ ఫిల్మ్ అని, ఆడియన్స్‌‌కు కొత్త ఎక్స్‌‌పీరియెన్స్ ఇస్తుందని హీరోయిన్  సంయుక్త విశ్వనాథన్ చెప్పింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆంటోనీ వర్గీస్, కదిర్ ఈ సినిమా విజయంపై  కాన్ఫిడెంట్‌‌గా ఉన్నామని అన్నారు.