దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మలయాళ చిత్రం ‘ఐ యామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకుడు. వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో దుల్కర్ సల్మాన్ సూపర్ స్టయిలిష్ అవతార్‌లో కనిపించాడు. తన కెరీర్‌లో ఇది 40వ చిత్రం. ఆంటోని వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్‌బరివ్ యాక్షన్ సీన్స్ రూపొందిస్తున్నారు.
ఈ చిత్రానికి షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన, స్క్రీన్‌ప్లే అందించారు. ‘ఆర్డీఎక్స్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నహాస్ హిదాయత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మాలీవుడ్‌లో అంచనాలు నెలకొన్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
