ఆకాశం తప్ప.. ఏం కనబడకూడదు.. ఆకట్టుకుంటున్న టీజర్

ఆకాశం తప్ప.. ఏం కనబడకూడదు.. ఆకట్టుకుంటున్న టీజర్

దుల్కర్ సల్మాన్‌‌‌‌‌‌‌‌, సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని రూపొందిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒకతార’. శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తోంది.  గీతా ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌,  స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. శనివారం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  

కల్పన (సాత్విక)  జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన టాలెంటెడ్ స్టూడెంట్.  అయితే చదువులో ఎంత ప్రతిభ చూపించినా, ఆమెను ప్రోత్సహించేవారు ఎవరూ ఉండరు. చివరికి తల్లిదండ్రులు కూడా ఆమెను నిరుత్సాహపరుస్తూ పెళ్లి చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆమె జీవితంలోకి వచ్చిన కృష్ణ (దుల్కర్ సల్మాన్)   కల్పనకు అండగా నిలుస్తాడు. ఆమెకు అతిపెద్ద బలంగా మారి, ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తాడు.

‘కిందికి చూడకు, పక్కకి  చూడకు.. ఎప్పుడూ పైకే నీ దృష్టి..  ఆకాశం తప్ప.. ఏం కనబడకూడదు’ అంటూ దుల్కర్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. శ్రుతిహాసన్, శ్వాసిక, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.