Dunki Drop 2: లుట్ పుట్ గయా సాంగ్ వచ్చేసింది.. షారుఖ్ ఎనర్జీ నెక్స్ట్ లెవల్

Dunki Drop 2: లుట్ పుట్ గయా సాంగ్ వచ్చేసింది.. షారుఖ్ ఎనర్జీ నెక్స్ట్ లెవల్

బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan), స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Rajkumar Hirani) కాంబోలో వస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ డంకీ (Dunki). క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాప్సీ ప‌న్ను ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్‌, సునీల్ గ్రోవర్‌ కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ అంచనాలు పెంచేయగా.. తాజాగా ఫస్ట్ సాంగ్ రిలేస్ చేశారు మేకర్స్.      

లుట్ పుట్ గయా అంటూ సాగిన ఈ పాట ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. ఈ పాటలో షారుఖ్‌ ఖాన్‌ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. తనడైన డాన్స్ తో అదరగొట్టేశారు షారుఖ్జ్. ఇక పాత కూడా ఇన్స్టాంట్ గా హిట్ అయ్యింది. బీట్ కూడా చాలా బాగుండటంతో సూపర్ హిట్ గా నిలిచింది ఈ పాట. ఇక డంకీ సినిమాను రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది.