Dunki Movie Day 1 Collections: పఠాన్, జవాన్ మ్యాజిక్ రిపీట్ అవలేదు.. మరీ అంత తక్కువా?

Dunki Movie Day 1 Collections: పఠాన్, జవాన్ మ్యాజిక్ రిపీట్ అవలేదు.. మరీ అంత తక్కువా?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shahrukh khan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ  డంకీ(Dunki). సెన్సిబుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Raj kumar Hirani) తెరకెక్కించిన ఈ సినిమాలో తాప్సి పన్ను(Tapsi Pannu) హీరోయిన్ గా నటించారు. షారుఖ్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ముందునుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇక ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ.. ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలను మాత్రం అందుకోలేదు ఈ మూవీ. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడింది. నషారుఖ్ నుండి వచ్చిన గత రెండు సినిమాలు  పఠాన్, జవాన్ ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. కానీ.. డంకీ మాత్రం ఆ మార్క్ ను టచ్ చేయలేకపోయింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు డంకీ సినిమాకు మొదటిరోజు కేవలం రూ.65 కోట్ల నుండి రూ.70 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చిందని అంచనా. అందులో రూ.35 కోట్ల వరకు నెట్ ఉందని సమాచారం. 

ఇక ప్రభాస్ సలార్ ఎఫెక్ట్ కూడా డంకీ సినిమాపై పడిందనే చెప్పాలి. సలార్ పైన కూడా ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో డంకీ సినిమాపై ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఆ ఎఫెక్ట్ డంకీ సినిమా కలెక్షన్స్ పై పడింది. మరి లాంగ్ రన్ లో డంకీ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.