నాకు నేనే అందంగా కనిపించిన సినిమా : నాని

నాకు నేనే అందంగా కనిపించిన సినిమా : నాని

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. డిసెంబర్ 7న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో మొదలైన ఈ ట్రైలర్‌‌‌‌లో.. కూతురు కోసం రకరకాల కథలు చెబుతుంటాడు నాని. అనుకోకుండా వీళ్ల జీవితాల్లోకి మృణాల్ వస్తుంది. 

ఆ తర్వాత ఓ సందర్భంలో తన కూతురికి తల్లి కథ చెబుతుంటాడు. తల్లి ఎలా ఉంటుందో తెలియని ఆ పాప.. ఆ స్థానంలో మృణాల్‌‌ను ఊహించుకుంటుంది. అతని గతం ఏమిటి..  భర్తను, పాపను వదిలి  భార్య ఎక్కడికి వెళ్లింది... ఆ ప్లేస్‌‌ను మృణాల్ రీప్లేస్ చేసిందా, లేదా అనే అంశాలు మిగతా కథ. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌‌ తో పాటు లవ్‌‌ స్టోరీ మనసుకు హత్తుకునేలా ఉంది. ట్రైలర్ రిలీజ్‌‌ సందర్భంగా జరిగిన ఈవెంట్‌‌లో నాని మాట్లాడుతూ ‘ఇన్నేళ్ల నా  కెరీర్‌‌‌‌లో ఫస్ట్ టైమ్ నాకు నేనే అందంగా కనిపించిన సినిమా ఇది. 

అంత అద్భుతంగా శౌర్యువ్ నా పాత్రను డిజైన్ చేశాడు. పాటలు, టీజర్, ట్రైలర్‌‌‌‌లో చూసింది కొంతే. కానీ సినిమాలో ఎవరూ ఎక్స్‌‌పెక్ట్ చేయని అంశాలు చాలా ఉన్నాయి.  సినిమా అనేది నాకు ఆక్సిజన్ లాంటిది. అలాంటి ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా.. ప్రేక్షకులు అంతా ప్రేమలో పడిపోయే సినిమాతో వస్తున్నా. అందరి అంచనాలకు తగ్గకుండా సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు.