
నాని పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్న చిత్రం ‘దసరా’. కీర్తి సురేష్ హీరోయిన్. బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్నాడు. శుక్రవారం నాని బర్త్ డే సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఫైర్ బ్రాండ్ ధరణి పాత్రలో నటిస్తున్న నాని, మాస్ స్టైల్‌లో క్రికెట్ ఆడటం ఆకట్టుకుంది. లుంగీ పైకి కట్టి, కళ్లజోడు పెట్టి, బీడీ తాగుతూ సిక్స్ కొట్టిన నాని.. బ్యాట్‌ని గాల్లో విసిరేసి నడుచుకుంటూ వచ్చే సీన్‌ను ఇందులో చూపించారు. నాని యాక్టింగ్‌తో పాటు సంతోష్ నారాయణ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేసింది. ఇక నాని బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని 39 సెంటర్స్‌లో కౌంట్ డౌన్ ఇన్‌స్టాలేషన్‌లు ఏర్పాటు చేశారు. కౌంట్ డౌన్ ప్రారంభమైన రోజు నుండి విడుదల తేదీ వరకు ప్రతి రోజు థియేటర్లలో కటౌట్‌లను మారుస్తారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది.