
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ OG (Orginal Gangstar). సుజీత్ (Sujeeth) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అభిమానులకి భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుంది.
ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ప్రొడ్యూసర్ ధానయ్య(Daanayya) నిర్మిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది. ఇదిలా ఉంటే..లేటెస్ట్ గా OG సినిమా నిర్మాణం నుంచి ప్రొడ్యూసర్ ధానయ్య తప్పుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. దీంతో అలాంటి వార్తలను నమ్మొద్దు అంటూ ఖండిస్తూ ట్వీట్ చేసింది.
'OG పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉండబోతుందో మాకు పూర్తి క్లారిటీ ఉంది. మేము దాని దిశగా ముందుకు సాగుతున్నాము. అతనికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. ఒకే మాట చెప్పగలం. ఆకలి ఎక్కువ కాలం ఉంటుంది, కానీ చిరుత తన వేటను అసలు వదిలిపెట్టదు. అంటూ స్ట్రాంగ్ స్టేట్ మెంట్తో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓజీ సినిమా విషయానికి వస్తే..బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో చిత్రీకరణ తో బిజీగా ఉన్నారు డైరెక్టర్ సుజీత్. కొంతమేరకు పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల..షూటింగ్ కు కాస్తా ఇబ్బంది నెలకొనడంతో ఓజీ సినిమా విషయంలో డిలే అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
#OG is ours… #OG will be forever ours…❤️?
— DVV Entertainment (@DVVMovies) January 8, 2024
We have full clarity on how Pawan Kalyan garu’s film will unfold. We are progressing towards it. Always thankful to him.
The hunger will be for a longer time, but the Cheetah hunt will leave nothing behind. ? #TheyCallHimOG pic.twitter.com/KgSZFIeI27